Jagan : మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ జరిపింది. విచారణ హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని రఘురామ పిటిషన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. సీజేఐ ధర్మాసనం నుంచి మరో ధర్మాసనానికి పిటిషన్ విచారణ బదిలీ చేసింది.
Also Read : BIG BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో నలుగురు BRS ఎమ్మెల్యేలకు నోటీసులు
జగన్ బెయిల్ రద్దు చేయాలని, విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గతంలో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపి పిటిషన్లపై విచారణ బెంచ్‌ను మార్చింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ముందు డిసెంబర్ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
Also Read : BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు
Also Read : Vivian Jenna Wilson: ట్రంప్ గెలిచారు, నేను అమెరికా నుంచి వెళ్లిపోతా..మస్క్ కుమార్తె ప్రకటన
జగన్ కు కొత్త గండం...?
భారతి సిమెంట్స్ తో పాటు, సరస్వతి పవర్ ఆస్తులను 2016లో ఈడీ అటాచ్ చేసింది. అయితే.. ఈ ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల పంపకం 2019లో జరిగిందని జగన్, షర్మిల చెబుతున్నారు. ఇది బెయిల్ కండిషన్లను ఉల్లంఘించినట్లు అయ్యింది. దీంతో బెయిల్ రద్దు అయ్యి.. జగన్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. ఈ అంశాన్ని న్యాయ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Also Read : AP Budget 2024: రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్.. ఆ శాఖకు భారీగా నిధులు!
Also Read : Arjun Kapoor: అందరికీ దూరంగా ఒంటరిగా.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అర్జున్ కపూర్!