నా ఫోన్ లాక్కొని.. సంతకం పెట్టకపోతే చంపేస్తాం.! | Raghu Rama Krishnam Raju Emotional Interview | RTV
AP: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సీజేఐ ధర్మాసనం మరో బెంచ్‌కు మార్చింది. కాగా జగన్ బెయిల్ రద్దు చేయాలని RRR సుప్రీంలో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటోను పంచుకున్నారు. భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ట్వీట్ చేశారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు నీలం సంజీవరెడ్డిని కలిసి తీయించుకున్న ఫొటోను పోస్టు చేశారు.
ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 400 మంది టీడీపీ నాయకులు తమ రాజీనామా పత్రాలను రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి పంపారు. సీటు అధికారికంగా రఘురామ కృష్ణంరాజుకు అనౌన్స్ అయితే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ రామరాజు వర్గీయులు హెచ్చరిస్తున్నారు.
నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. పాలకొల్లు సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరారు. ఆయనను పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.
ఎంపీ రఘురామకృష్ణరాజుకు బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి షాక్ ఇచ్చింది. నరసాపురం సీటు ఆశించిన రఘురామాకు నిరాశే మిగిలింది. నరసాపురం టికెట్ శ్రీనివాస్ వర్మకి ఇచ్చింది బీజేపీ. దీంతో టీడీపీ నుంచి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని రఘురామా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.