BIG BREAKING : ఏపీలో డీఎస్సీ, టెట్‌కు లైన్‌ క్లియర్‌

ఏపీలో డీఎస్సీ, టెట్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.

New Update
ap-dsc-exam2025

ఏపీలో డీఎస్సీ, టెట్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. డీఎస్సీ షెడ్యూల్‌ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్‌, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌ వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ లపై విచారణ చేపట్ఠిన అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇదే అంశంపై జూన్ 05వ తేదీన హైకోర్టను ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది.

Also Read :  ఈ 6 అలవాట్లతో మీ శరీరంలో అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయ్!

Also Read :  వంటింట్లో ఉండే దీన్ని తీసుకుంటే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్

16 వేల 347 టీచర్ ఉద్యోగాలు 

కాగా 16 వేల 347 టీచర్ ఉద్యోగాలకు ధరఖాస్తు ప్రక్రియ ముగిసింది. జూన్ 06వ తేదీ నుంచి జూలై 08వరకు పరీక్షలు జరగనున్నాయి.  అయితే పరీక్షకు  మరింత సమయం ఇవ్వాలని కొంతమంది అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సీబీటీ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. ప్రిలిమినరీ కీల విడుదల తర్వాత 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ కీని ప్రకటిస్తారు. తుది కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా రిలీజ్ అవుతాయి. 

Also Read :  తెలంగాణలో ఫస్ట్ కోవిడ్ కేసు.. డాక్టర్‌నే కాటేసిన కరోనా

Also Read :  కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకి కవిత...KCRతో భేటీ!

Andhra Pradesh | DSC schedule | Supreme Court | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు