ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..ఒడిశా గవర్నర్‌‌గా కంభంపాటి హరిబాబు

పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీ, నియామకాలను చేసింది కేద్రం. దీని ప్రకారం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా నియమించారు.

author-image
By Manogna alamuru
New Update
governor

Kambhampati Haribabu

ఒడిశా, మిజోరంతో సహా మరో మూడు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ, నియామకాలను చేసింది కేంద్రం. మిజోరం నూతన గవర్నర్‌గా ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌; కేరళ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌, ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ను బిహార్‌ గవర్నర్‌గా నియమించారు. అలాగే, మణిపుర్‌ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్‌ కుమార్ భల్లాను నియమించారు. అలాగే ప్రస్తుతం మిజోరం గవర్నర్‌‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌‌గా బదిలీ చేశారు. వీటికి సంబంధించిని ఉత్తర్వులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేశారు. 

Also Read: CBI: ఇంటర్ పోల్ తరహాలో భారత్ పోల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు