ఆంధ్రప్రదేశ్ Parvathipuram: ఆ ప్రాంతంలో వింత ఆచారం.. నాలుకతో నైవేద్యం సేకరిస్తే అలా జరుగుతుందట!! శ్రీకాకుళం లోని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామానికి చెందిన రైతులు.. వర్షాలు పడాలని వినూత్నంగా ప్రత్యేకమైన పూజలతో పాటు, ఆచార వ్యవహారాలు పాటిస్తారు. గ్రామ సమీపంలోని నాలుగు కిలో మీటర్ల దూరంలోని కొండపై ఉన్న అమ్మవారి ఆలయానికి డప్పు వాయిద్యాలతో వెళ్తారు. అక్కడ అమ్మవారికి కోడి లేదా మేకను బలి ఇస్తారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న సరుకులతో అక్కడే 'వరద పాయసం' తయారు చేసుకుంటారు. దాన్ని అక్కడ కొండపైనే నేలపై వేసుకుని.. నాలుకతో ఆ వరద పాయసాన్ని స్వీకరిస్తారు రైతులు. ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి.. పంటల బాగా పండుతాయని వారి నమ్మిక. By E. Chinni 14 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Minister Dharmana Prasada Rao: 14 ఏళ్లు సీఎం అయి ఉండి.. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశావా?: మంత్రి ధర్మాన ఫైర్ మేము చేయలేదు అంటున్నారు.. కనీసం మీరు ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శనివారం ఆయన శ్రీకాకుళంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు.. ప్రాజెక్టుల గురించి ప్రశ్నించడం ఏంటి? అని నిలదీశారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటించి తనకు అభిమానం ఉన్నట్లు, సాగునీటి ప్రాజెక్టులను.. వైసీపీ ప్రభుత్వం ఏదో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేశారు. 1996లో సీఎం అయి.. 14 ఏళ్లు ముఖ్యమంత్రి అయిన మీరు ఏంచేశారు?, కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పగలరా? అంటూ అడిగారు. వంశధార ప్రాజెక్టుపై ఏనాడైనా పట్టించుకున్నారా?, గతంలో విద్యుత్ చార్జీలు ఎందుకు తగ్గించలేదు.. ఉచిత విద్యుత్ దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు By E. Chinni 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా గుట్టురట్టు..గోవా టూ వైజాగ్, విజయనగరం ..! గత కొంతకాలంగా గోవా టూ శ్రీకాకుళం వయా విశాఖపట్నం యదేచ్ఛగా లిక్కర్ రవాణా సాగుతోందని పోలీసుల సమాచారం. దీనికోసం ఓ ముగ్గురు ముఠాకట్టారు. విజయనగరం జిల్లాకు చెందిన పొద్దిలాపూర్ సత్యనారాయణ, ధనుంజయ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన గొర్ల లక్ష్మణ్ భాగస్వాములుగా ఉన్నారు. విజయనగరం సత్యనారాయణ ఈ దందాలో ప్రధాన నిందితుడు. అతడు గోవాలో చీప్ లిక్కర్ రూ.26 కొని రూ. 92 కు శ్రీకాకుళం లక్ష్మణ్ కి అమ్ముతాడు. అతను రూ. 100 కి ధనుంజయకు అమ్ముతాడు.ధనుంజయ రూ. 120కు లోకల్ మందుబాబులకు అమ్ముతాడు. గోవా నుంచి బాక్సులకు బాాక్సులు లిక్కర్ వాస్కోడీగామా ట్రైన్ లో వైజాగ్ కు తరలిస్తారు.ఈ సరుకుని వివిధ బస్ రూట్లలో పలు ప్రాంతాలకు తరలిస్తారు.డిప్యూటీ కమిషనర్ బాబ్జి రావు, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ప్రకటనలో తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి తరచూ వస్తున్న ప్రయాణికుల పై నిఘా పెంచారు. By V. Sai Krishna 29 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Floods 2023: ఏపీలో విస్తారంగా వర్షాలు...ఆ జిల్లాలకు భారీ వర్షసూచన ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ఏపీ ఐఎండీ ప్రకటించింది. ఐఎండీ అంచనా ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. By Shareef Pasha 19 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు మొన్నటి వరకు ఎండలతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలకు కాస్త కూల్ తగిలింది. అంతేకాకుండా అన్నదాతలకు శుభవార్త కూడా చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఇలానే మరికొన్ని రోజులు వానలు పడే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్పారు. దీంతో రైతలు కరీఫ్ సీజన్‌కు సిద్ధమయ్యారు. By Vijaya Nimma 05 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn