/rtv/media/media_files/2025/02/04/NRrCdxEqu8Hnge7U59Bj.jpg)
death ceremonyc Photograph: (death ceremony)
కృష్ణా జిల్లా పెడన మండలం ముచ్చర్లలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కొడుకులు తల్లి ఉండగానే ఆమెకు పెద్దకర్మ కార్యక్రమం చేశారు. ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే తల్లే కావాలని కొడుకులతో చనిపోయాక చేయాల్సిన పెద్దకర్మను ఆమె బతికి ఉండగానే నిర్వహించాలని కోరింది. మొదట కొడుకులు ఒప్పుకోలేదు. తల్లి ఒత్తిడి వల్ల తల్లి కోరికను తీర్చాలనుకున్నారు.
Also Read: రేపే మహా కుంభమేళాకు ప్రధాని మోదీ !.. షెడ్యూల్ ఇదే
తల్లి రంగమ్మ(80) ఊరందరినీ, బంధువులను పిలిచి ఆమె పెద్దకర్మ చేసి.. భోజనాలు పెట్టాలని ఇద్దరు కొడుకులకు చెప్పింది. దీంతో తల్లి కోరిక మేరకు వారు గ్రామస్తులు, బంధువులను పిలిచి భోజనాలు పెట్టారు. అప్పుడు రంగమ్మ సంతోషించారు. అసలు రంగమ్మ అలా ఎందుకు చేసిందో తెలుసా..?
Also Read: చాట్ జీపీటీది లెఫ్ట్ భావాజాలం: ఎలాన్ మస్క్
రంగమ్మ ఇద్దరు కొడుకుల మధ్య గొడవలు అవుతుంటాయి. ఇటీవలనే వారికి తల్లి ఆస్తిని పంచి ఇచ్చారు. పెద్దమనుషుల సమక్షంలో ఉన్న భూమి ఇరువురికీ సమానంగా కేటాయించారు. దీంతో ఆమె చనిపోయాక కనీసం పెద్దకర్మ అయినా చేస్తారో లేదో అని రంగమ్మకు అనుమానం. ఆస్తి సెట్టిల్ చేశా కాబట్టి తన చావుని కొడుకులు పట్టించుకోరని.. బతికి ఉండగానే పట్టుబట్టి పెద్దకర్మ చేయించుకుంది.