/rtv/media/media_files/2025/09/06/bus-accident-2025-09-06-09-01-37.jpg)
Bus accident
Crime: ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం తెల్లవారుజామున ముందు వెళ్ళుతున్న గ్రానైట్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాల కాగా వారిలో 5 మంది కి తీవ్ర గాయాలయ్యాయి. నాయుడు పేట–పూతలపట్టు ప్రధాన రహదారిలోని చంద్రగిరి మండలం, అగరాల పంచాయితీ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలో కంటైనర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది.
48 మంది ప్రయాణికులతో కూడిన ఆర్టీసీ బస్సు బెంగళూరు నుండి తిరుపతి మీదుగా శ్రీకాళహస్తికి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.30 మంది ప్రయాణీకులతో పాటు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. క్షతగాత్రులను రూయా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి:Balapur Ganesh Laddu: కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!