ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ పెడుతుంది. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేస్తుంది. ఇప్పటికే ఎన్నో బడా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. మరికొన్ని కంపెనీలు, వ్యాపారవేత్తలు ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read: Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్!
రాష్ట్రంలో రూ.65,000 కోట్లతో పెట్టుబడి
ఈ తరుణంలోనే తాజాగా మరో బడా కంపెనీ ఏపీలో కనివిని ఎరుగని రీతిలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఏకంగా రూ.65,000 కోట్లు పెట్టుబడులు పెట్టబోతోంది. వచ్చే 5ఏళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది. దీంతో క్లీన్ ఎనర్జీ కింద రాష్ట్రానికి వస్తున్న అతి పెద్ద పెట్టుబడి ఇదే అని చెప్పుకోవచ్చు.
Also Read: BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు
అయితే ఈ 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ లో ఒక్కో ప్లాంట్ కు దాదాపు రూ.130 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నారు. అది కూడా రాష్ట్రంలోని బంజరు భూముల్లో. ఇక ఈ ప్లాంట్లు ఏర్పాటు అయితే రాష్ట్రంలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పరోక్షంగా 2 లక్షల 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ మధ్య ఇవాళ విజయవాడలో ఎంవోయూ జరగనుంది.
Also Read: Ap Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయనే..!
అయితే ఈ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నట్లు మంత్రి లోకేష్ చెప్పాడు. కానీ రిలయన్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇంకా రాలేదు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు. అలాగే రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రణాళిక కూడా రూపొందించామని చెప్పుకొచ్చారు.