/rtv/media/media_files/2026/01/24/fotojet-6-2026-01-24-08-36-05.jpg)
Rats in Annavaram temple prasadam baskets.
Annavaram Prasadam : కాకినాడ జిల్లా(kakinada-district) అన్నవరం సత్యదేవుని నమూనాలయం వద్ద ప్రసాదం నిల్వ బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో వైరల్(video-viral) అయింది. అన్నవరం సత్యదేవుని నమునాలయం వద్ద ప్రసాదం నిల్వ ఉంచే బుట్టల్లో ఎలుకలు తిరుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికారులు స్పందించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఇద్దరు సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. జాతీయరహదారిపై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు నమూనాలయం వద్ద ప్రసాదం కొనుక్కుంటారు.
అన్నవరం దేవస్థానంలో ప్రసాదం బుట్టల నిండా ఎలుకలు. భక్తులు ఎలుకలు ఏంటని ప్రశ్న. కొనుక్కుంటే కొనండి లేకపోతే వెళ్లిపోండంటూ దురుసుగా ప్రవర్తించిన సిబ్బంది.#annavaram#rats#AndhraPradesh#UANowpic.twitter.com/Rfu9jB37HA
— UttarandhraNow (@UttarandhraNow) January 23, 2026
Also Read : మరో భర్తకు మూడింది.. తమ్ముడితో కలిసి భర్తను చంపిన భార్య
Rats In Annavaram Temple Prasadam Baskets
అన్నవరం నమూనాలయం జాతీయ రహదారిపై ఉండటం వల్ల ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే భక్తులు ప్రసాదం కొనుగోలు చేయడానికి వస్తుంటారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య కొందరు భక్తులు అక్కడికి వచ్చారు. స్వామివారి ప్రసాదం ప్యాకెట్లు నిల్వ ఉంచిన ప్లాస్టిక్ బుట్టల్లో ఎలుకలు తిరుగుతుండటాన్ని గమనించారు. ఈ విషయమై అక్కడి సిబ్బందిని ప్రశ్నించగా "అవును.. ఇలాగే ఉంటాయి, ఇష్టమైతే కొనుక్కోండి.. లేకపోతే పొండి" అని సిబ్బంది సమాధానం చెప్పారు. - Annavaram Temple
ఆగ్రహంతో భక్తులు వెంటనే ఈ వీడియోను మొబైల్‌లో రికార్డ్ చేశారు. అనంతరం సోషల్ మీడియాలో పెట్టారు.ఈ సంఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఈ విషయం అన్నవరం ఆలయ ఈవో త్రినాథరావు దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే స్పందిచి ప్రసాదం నిల్వ ఉంచే క్యాబిన్ వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.అధికారులు వెంటనే స్పందించి, ప్రసాదం నిల్వ చేసే క్యాబిన్‌కు మరమ్మతులు చేయించారు. ఎలుకలు లోపలికి ప్రవేశించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నిర్లక్ష్యానికి కారణమైన సిబ్బంది త్రిమూర్తులు, భద్రతా సిబ్బంది రాజులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. అలాంటి ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం భక్తులకు ఇబ్బంది కలిగించింది. అధికారులు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని తెలిపారు.. ప్రసాదం నిల్వ ఉంచిన చోట అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాము అన్నారు.
Also Read : ఏపీలో పెను విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహ**త్య!
Follow Us