B Pharmacy Student Murder: నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతకం..బీ ఫార్మసీ విద్యార్థినిని కత్తితో పొడిచి..

నెల్లూరులో బీ ఫార్మసీ విద్యార్థిని మైథిలిప్రియను ఆమె స్నేహితుడు నిఖిల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కరెంట్ఆఫీస్ సెంటర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాట్లాడాలని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిఖిల్ అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

New Update
Love addict kills B. Pharmacy student in Nellore..

Love addict kills B. Pharmacy student in Nellore..

B Pharmacy Student Murder: నెల్లూరు నగరంలో బీ ఫార్మసీ విద్యార్థిని మైథిలిప్రియను ఆమె స్నేహితుడు నిఖిల్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మాట్లాడాలని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిఖిల్ అనంతరం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రేమను నిరాకరించిందనే కారణంతోనే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. అక్కడ ఉన్న మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మైథిలిప్రియను ప్రేమకు నిరాకరించడంతో నిందితుడు హతమార్చి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చూడండి:Anushka Shetty: కొంతకాలం కనిపించను.. అనుష్క షాకింగ్ నిర్ణయం! వైరలవుతున్న లెటర్

నిందితుడు నిఖిల్‌, మృతురాలు మైథిలి ప్రియ రాపూరు మండలం చుట్టుపాలెం, స్వాతి బి ఫార్మసీ కాలేజీలో ఇద్దరు క్లాస్ మెట్స్‌ అని తెలుస్తోంది.  బెంగళూరులో జాబ్ చేస్తున్న మృతురాలు మైధిలి ప్రియ.. సెప్టెంబర్ 6 పుట్టినరోజు కావడంతో.. మూడో తేదీ నెల్లూరుకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయం తెలిసి- మాట్లాడాలి అని రూమ్ కి రమ్మంటు నిఖిల్‌ మైదిలికి ఫోన్ చేశాడు. రూమ్ కి వెళ్లిన తర్వాత మైధిలిని నిఖిల్‌ కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోంది. కాగా మైథిలిని హత్య చేసిన అనంతరం  మృతురాలి చెల్లి సాహితికి  ఫోన్ చేసి రమ్మని పిలిచినట్లు తెలుస్తుంది.- సాహితీ స్పాట్ కి వెళ్లేసరికి.. మెట్లపైనే మైథిలి ప్రియా మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా అవక్కాయింది.  మైథిలికి తనకు గొడవ జరిగిందని, అందుకే చంపేశానని సాహితికి చెప్పిన నిఖిల్ అనంతరం - దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. ప్రేమ పేరుతో వేధించి.. తన కుమార్తెను హత్య చేశాడని మృతురాలి తల్లి లక్ష్మి బోరున విలపించింది.

ఇది కూడా చూడండి:BREAKING: దిశా పటాని ఇంటి ముందు కాల్పులు

అయితే, మైధిలిప్రియను నిఖిల్‌ చాలాకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ప్రేమకు నిరాకరించినందుకే నిందితుడు హతమార్చి ఉంటాడని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. మైధిలిప్రియ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్‌కి తరలించారు పోలీసులు. మైధిలిప్రియ మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడు నిఖిల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిని‌ కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Manipur: 2023 అల్లర్ల తర్వాత మొదటిసారి మణిపూర్ కు ప్రధాని మోదీ..ఈరోజే

Advertisment
తాజా కథనాలు