Crime : నరికింది అల్లుడే.. కుక్క నోట్లో తెగిన అత్త  చెయ్యి.. వీడిన మిస్టరీ!

బెంగళూరులోని తుమకూరు జిల్లాలో జరిగిన మహిళా మర్డర్ కేసు వీడింది. అల్లుడే ఆమెను19 ముక్కలుగా నరికి చంపేశాడు. రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లో దొరికిన మానవ శరీర భాగాలు లభ్యమయ్యాయి. మృతురాలిని బెళ్లావికి చెందిన లక్ష్మీ దేవి (42) గుర్తించారు.

New Update
doctor

బెంగళూరులోని తుమకూరు జిల్లాలో జరిగిన మహిళా మర్డర్ కేసు వీడింది. అల్లుడే ఆమెను19 ముక్కలుగా నరికి చంపేశాడు. రోడ్డుపై ప్లాస్టిక్ కవర్లో దొరికిన మానవ శరీర భాగాలు లభ్యమయ్యాయి. మృతురాలిని బెళ్లావికి చెందిన లక్ష్మీ దేవి (42) గుర్తించారు. ఓ ఆసుపత్రిలో డెంటల్ డాక్టర్‌గా పనిచేస్తున్న అల్లుడు రామచంద్ర.. అత్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో ఆమెను హతమార్చినట్లుగా పోలీసులు విచారణలో తేల్చారు. లక్ష్మీ దేవిని 19ముక్కలుగా కోసి, 14 ప్లాస్టిక్ కవర్లలో కుక్కి పడేశాడు రామచంద్ర. అతనికి సపోర్ట్ చేసిన మరో ఇద్దరు సతీష్ కెఎన్ (38), కిరణ్ కెఎస్ (32)లను  కూడా కోరటగెరె పోలీసులు అరెస్ట్ చేశారు.  

రామచంద్రయ్య తన అత్తను చంపడానికి ఆరు నెలల ముందే పక్కా ప్లాన్ వేశాడు. ఆగస్టు 3న, లక్షీదేవి తన కుమార్తె ఇంటి నుంచి తిరిగి వస్తున్నప్పుడు, రామచంద్రయ్య ఆమెను తన కారులో ఎక్కించుకుని, తన ఇద్దరు స్నేహితులతో కలిసి కలిసి ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. ఆ తర్వాత శవాన్ని తుమకూరులోని సతీష్ పొలానికి తీసుకెళ్లారు.  మరుసటి రోజు ముగ్గురు కలిసి శవాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి, 19 వేర్వేరు ప్రదేశాలలో పారేశారు. దీనివల్ల బాధితురాలు ఎవరు అనేది గుర్తించకుండా చేయాలని భావించారు. 

తుమకూరులో సంచలనం

అయితే పోలీసులకు ఆమె శరీర భాగాలపై ఉన్న ఆభరణాలు, టాటూల ఆధారంగా ఆమెను గుర్తించారు. ఈ కేసు తుమకూరులో సంచలనం సృష్టించింది. దర్యాప్తు కొనసాగుతోంది. ఆమెను హత్య చేయడానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే పనిలో పడ్డారు.  ప్రాధమికంగా 2019లో లక్ష్మీ దేవి కుమార్తె తేజస్విని రెండో వివాహం చేసుకున్నాడు డాక్టర్ రామచంద్రయ్య. అయితే తమ వివాహంలో తన అత్త జోక్యం చేసుకోవడం పట్ల కలత చెందినట్లు సమాచారం. తన భార్యను ప్రభావితం చేసి ఇంట్లో విభేదాలు సృష్టించినందుకు ఆమెను చంపాలని స్కెచ్ వేసినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. కాగా డాక్టర్ రామచంద్రయ్య మొదటి భార్యతో విడాకుల ప్రక్రియ ఇంకా కోర్టులో కొనసాగుతోంది. 

మంచిర్యాల జిల్లాలో దారుణం 

మంచిర్యాల జిల్లాలోని భగవంతవాడలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి ముందే వరకట్న వేధింపులతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ పేరుతో అనూషను మోసం చేశాడు శ్రీకాంత్‌. నాలుగు సంవత్సరాలుగా అనూషకు, శ్రీకాంత్‌కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. కులాలు వేరు కావడంతో ఇద్దరి పెళ్లికి పెద్దల నిరాకరించారు. అయితే డబ్బులు, నగలు ఇస్తే తానే పెళ్లి చేసుకుంటానన్నాడట శ్రీకాంత్‌.  తనను కాదని వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటే..వారిద్దరి సన్నిహిత ఫోటోలు బయటపెడతానంటూ శ్రీకాంత్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో శ్రీకాంత్‌ మోసం చేశాడన్న మనస్థాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని అనూష ప్రాణాలు తీసుకుంది. అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకే ఒక్క కూతురు ప్రాణాలు కోల్పోవడంతో బోరున విలపిస్తున్నారు. అనూషను శ్రీకాంత్‌ తరుచూ వేధించేవాడని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శ్రీకాంత్ అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నారని సీఐ ప్రమోద్ తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు