TTD: తిరుమల వెళ్లే వారికి శుభవార్త.. ఇక ఆ బాధ ఉండదు..!

తిరుమల పవిత్రతను, భక్తుల భద్రతను కాపాడాలనే లక్ష్యంతో పోలీస్ శాఖ ప్రత్యేక శుద్ధీకరణ డ్రైవ్‌ను నిర్వహించాయి. కొండపై అనధికారికంగా తిష్ట వేసి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులు, అనుమానితులు, గొడవలు సృష్టించే వారిని తరలించడం ఈ డ్రైవ్‌ను నిర్వహించారు.

New Update
ttd news

TTD News

తిరుమల పవిత్రతను, భక్తుల భద్రతను కాపాడాలనే లక్ష్యంతో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్, ఆరోగ్య & పారిశుద్ధ్య విభాగం సంయుక్తంగా ప్రత్యేక శుద్ధీకరణ డ్రైవ్‌ను నిర్వహించాయి. కొండపై అనధికారికంగా తిష్ట వేసి భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులు, అనుమానితులు, గొడవలు సృష్టించే వారిని (ట్రబుల్ మాంగర్స్) తరలించడం ఈ డ్రైవ్‌ను నిర్వహించారు.

భక్తుల సౌకర్యార్థం:

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్, టీటీడీ సీవీఎస్ఓ శ్రీ మురళీకృష్ణ, ఐపీఎస్‌ల  ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. నందకం, వరాహస్వామి గెస్ట్ హౌస్, కళ్యాణకట్ట, ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్, సీఆర్ఓ వంటి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మొత్తం 48 మందిని తిరుమల నుంచి తరలించారు.  12 మంది ట్రబుల్ మాంగర్స్‌పై బౌండ్‌ ఓవర్‌ చర్యలు (శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని హామీ పత్రాలు రాయించుకోవడం) తీసుకున్నారు. మరో 23 మంది అనుమానితుల వేలిముద్రలను తనిఖీ చేశారు. ఈ వ్యక్తులు దీర్ఘకాలంగా అక్రమంగా బస చేస్తూ.. భక్తుల వసతి సౌకర్యాలకు ఇబ్బంది కలిగించడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

పెరుగుతున్న యాచకుల బెడద:

తిరుమల కొండపై భక్తులకు యాచకుల వేధింపులు ఒక పెద్ద సమస్యగా మారాయి. అనేక ప్రాంతాల్లో యాచకులు భక్తుల దారిని అడ్డుకోవడం, డబ్బుల కోసం పదేపదే వేధించడం వంటి చర్యల వల్ల భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ సమస్యకు అడ్డుకట్ట వేయడం.. కొండపై పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడం ఈ డ్రైవ్ యొక్క ప్రధాన లక్ష్యం. ఇటీవల తిరుమలలోని కొన్ని హోటళ్లు, టీ దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థలలో పనిచేస్తున్న కార్మికులు కూడా భక్తుల కోసం కేటాయించిన షెడ్లు, హాల్స్‌ను అక్రమంగా ఆక్రమించి నివాసం ఉంటున్నారు. దీనివల్ల వసతి కోసం వచ్చే భక్తులకు స్థలం దొరకకపోవడం, అక్రమ బస చేసే వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం వంటి ట్రబుల్ మాంగింగ్ కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవంండి: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావట్లేదని మామను చంపిన అల్లుడు!

వ్యాపార సంస్థలకు సూచనలు:

భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా నిరోధించడానికి అధికారులు తిరుమలలో వ్యాపారాలు నిర్వహిస్తున్న హోటళ్లు, దుకాణాల యజమానులకు గట్టి సూచనలు చేశారు. తమ వద్ద పనిచేస్తున్న కార్మికులకు యజమానులు తప్పనిసరిగా తగిన వసతి, ఇతర సదుపాయాలు కల్పించాలి. అంతేకాకుండా కార్మికుల పనులు పూర్తయిన తర్వాత వారిని తిరుమలలో కాకుండా.. తిరుపతిలోనే ఉంచేలా చూడాలి. తిరుమలలో అక్రమ బసను పూర్తిగా నివారించాలన్నారు.  ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.

భవిష్యత్తు ప్రణాళికలు:

తిరుమలలో శాంతిభద్రతలను కాపాడటానికి అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. కేవలం ఈ ఒక్క డ్రైవ్‌లోనే కాకుండా.. గత మూడు నెలల్లో కూడా ఇదే విధంగా 275 మందిని తరలించినట్లు అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ.. వారి భద్రత, కొండపై శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. అందుకే ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లను తరచుగా కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ సంయుక్త చర్యల వల్ల తిరుమలలో భక్తులు మరింత ప్రశాంతంగా దర్శనం చేసుకోగలుగుతారని.. అనధికారిక కార్యకలాపాలు, యాచకుల బెడద తగ్గుతుందని స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు, టీటీడీ విజిలెన్స్, ఆరోగ్య శాఖ సిబ్బందిని అభినందించారు. తిరుమల పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడటానికి.. భక్తుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇలాంటి కఠినమైన నిర్ణయాలు, నిరంతర పర్యవేక్షణ ఎంతైనా అవసరమన్నారు. 

ఇది కూడా చదవంండి: మోషన్‌కు వెళ్లిన తర్వాత ఈ 7 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Advertisment
తాజా కథనాలు