/rtv/media/media_files/2025/03/14/emyNhZVxmXNJ44Cah34j.jpg)
PM Modi
ఏపీలో కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. క్యాపిటల్ సిటీలో నవ నగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం త్వరలోనే జరగనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా నిర్వహించాని ఏపీ సర్కార్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ.. ఏప్రిల్ 15 నుంచి 20 తేదీల మధ్య అమరావతికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: పరాయి పురుషులతో శృంగారం ముచ్చట్లు.. ఆ కేసులో భార్యలకు షాక్ ఇచ్చిన హైకోర్టు!
మొదటిదశలో రాజధానిలో నిర్మాణాల కోసం, మౌలకి సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర సర్కార్ రూ.64,721 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటికే రూ.37,702 కోట్ల పనులకు టెండర్లు ఖరారు చేసింది. అయితే ఈ నిర్మాణ పనులను మిషన్ మోడ్‌లో చేపట్టేలా ప్రణాళికలు రెడీ చేస్తోంది. మార్చి 17న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది.అయితే ఈ సమావేశంలో వీటికి ఆమోదం లభించిన తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అగ్రిమెంట్ లెటర్లు జారీ చేయనుంది. వర్క్ ఆర్డర్లు జారీ కాగానే ఏజెన్సీలు పనులు ప్రారంభించనున్నాయి.
Also Read: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో హోలికా దహన్ ..లక్షలాది కొబ్బరికాయలతో...
ఇదిలాఉండగా 2014లో చంద్రబాబు ఏపీకీ సీఎం అయినప్పుడు ఏపీ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ వాటి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అమరావతిలో పనులు ఆగిపోయాయి. అప్పటి సీఎం జగన్ మూడు రాజధానుల ప్రస్తావన తీసుకురావడంతో రాజధాని నిర్మాణానికి అడుగులు పడలేదు. చివరికి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ రాజధానిగా అమరావతినే నిర్ణయించారు. దీంతో అక్కడ పనులు పునఃప్రారంభమయ్యాయి.
Also Read: వీడేం మనిషండీ బాబు.. పొరుగింటి వారితో గొడవ.. కారుతో ఢీకొట్టడంతో తలకిందులుగా వేలాడిన మహిళ!
Also Read: ఆ వయస్సులోనే కన్యత్వాన్ని కోల్పోతున్న భారతీయ మహిళలు