/rtv/media/media_files/2025/03/03/Jj1RCITHyNDzfgQagXX5.jpg)
Pithapuram ex MLA Pendem Dorababu meet AP Deputy CM Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు వైసీపీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ క్రమంలో కొందరు వెంట వెంటనే టీడీపీ, జనసేనా, బీజేపీ పార్టీలోకి చేరిపోతున్నారు. మరికొందరు కాస్త టైం తీసుకొని ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఎంతో మంది నేతలు వైసీపీ పార్టీని వీడారు.
ఇక త్వరలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం వైసీపీని వీడి జనసేనలో చేరుతారని గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి ప్రధాన కారణం.. ఆయన ఇప్పటికే వైసీపీ పార్టీకి రాజీనామ చేయడం. దీంతో దొరబాబు పార్టీ మార్పుపై వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఈ వార్తలను నిజం చేసినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్‌తో భేటీ
ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్‌తో చర్చించారు.
Also read : SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..
జనసేనలో చేరేందుకు దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా.. అందుకు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో మార్చి 9వ తేదీన పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్ లతో కలిసి ఆయన విజయవాడలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అయ్యారు.
Also Read : టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్
కాగా పెండెం దొరబాబు 2019 ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ కరువైంది. ఆ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వైఎస్ జగన్.. పెండెం దొరబాబును కాదని వంగా గీతను బరిలోకి దింపారు. కానీ ఈ ఎన్నికల్లో పవన్ గ్రాండ్ విక్టరీతో సంచలనం సృష్టించారు.