Pithapuram: పిఠాపురంలో వైసీపీకి బిగ్‌షాక్.. జనసేనలోకి పెండెం దొరబాబు?
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పదవి ఆశించకుండా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దొరబాబును కాదని వంగా గీతకు పిఠాపురం టికెట్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్.