AP News: ఎంపీడీఓపై దాడి కేసు.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం!

ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను పవన్ కళ్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు, పోలీసులకు సూచించారు.

author-image
By srinivas
New Update
sdfsdfsd

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

AP News: ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకొంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు. ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని చెప్పారు. 

ఇది కూడా చదవండి: Bosch:అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. క్రికెట్‌ చరిత్రలో ఏకైక మొనగాడు

ప్రజాస్వామ్యం పట్లా గౌరవం లేదా..

ఈ మేరకు శుక్రవారం గాలివీడు ఎంపీడీఓపై చోటు చేసుకున్న దాడి ఘటన గురించి అధికారులతో చర్చించారు. కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఎంపీడీఓకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని చెప్పారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న అప్రజాస్వామిక దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీఓ ఆరోగ్యం గురించీ వాకబు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

Advertisment
తాజా కథనాలు