/rtv/media/media_files/2025/07/17/jaggayyapet-crime-news-2025-07-17-18-19-55.jpg)
Jaggayyapet Crime News
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కుటుంబ గొడవ ఏడుగురి ప్రాణాల మీదకు దారితీసింది. కట్నం వివాదం నేపథ్యంలో దంపతుల మధ్య మొదలైన గొడవ వల్ల భారీ దాడి చేసుకున్నారు. ఏడుగురు బంధువులకు కత్తిపోట్లు పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. వేదాద్రి గ్రామానికి చెందిన ప్రవీణ్‌కు ఖమ్మం జిల్లా మధిరకు చెందిన రాజ్యలతతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో వరుడి కుటుంబం మధిరకు చెందిన వధువు కుటుంబాన్ని మూడు ఎకరాల పొలం కట్నంగా ఇవ్వాలంటూ ఒప్పించారు. ఆ సమయంలో వధువు పేరెంట్స్ కూడా ఆ ఒప్పందాన్ని అంగీకరించారు.
Also Read : సిరియాకు చుక్కలు చూపిస్తోన్న ఇజ్రాయిల్.. దాడులకు 8 ప్రధాన కారణాలివే!
కుటుంబ సభ్యులపై కత్తులతో దాడి..
కానీ వివాహం పూర్తయ్యాక కొన్ని కారణాల వల్ల ఆ పొలం రిజిస్ట్రేషన్ చేయలేదు. దీంతో ఈ వ్యవహారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. కొంతకాలంగా వధువు రాజ్యలతపై ప్రవీణ్ కుటుంబ సభ్యులు కట్నం విషయంలో వేధింపులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఈ వివాదం మరింత ముదిరి వాగ్వాదం దాడులకు దారితీసింది. వేదాద్రిలో రెండు కుటుంబాలు వాదనలు సాగిస్తుండగా.. ప్రవీణ్ తరపు బంధువులు రాజ్యలత కుటుంబ సభ్యులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆఫీస్ సవాళ్లను క్షణాల్లో అధిగమించే చిట్కాలు.. ఇలా ట్రై చేయండి
గతంలోనూ ఈ కుటుంబ వివాదంపై గ్రామ పెద్దలు పలుమార్లు రాజీ ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమయ్యారు. పొలం విషయంలో స్పష్టమైన తేలిపోకపోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతూ వచ్చింది. ఈ ఘటనలో ప్రవీణ్ ప్రధాన పాత్రధారిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆర్‌ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: తిరుపతిలో దారుణం.. భార్య, బిడ్డలను బావిలో తోసి చంపిన భర్త!
ఇది కూడా చదవండి:కంటి చూపు మెరుగుపరచడానికి ఇంటి చిట్కాలు తెలుసుకోండి
(ap crime latest updates | ap crime updates | ap-crime-news | Latest News)