/rtv/media/media_files/2025/02/04/O0MnXDk7sIuoAVigptCg.jpg)
Nellore breed cow Photograph: (Nellore breed cow)
Nellore Breed Cow: బ్రెజిల్‌లో జరిగిన వేలంలో ఆంధ్రప్రదేశ్ నెల్లురు జాతి ఆవు అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఈ నెల్లూరు జాతి మన దేశానికి చెందినదే. వీటినే ఒంగోలు జాతి అని కూడా పిలుస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం ఉన్న వీటికి వేడి వాతావరణం ఉండే దేశాల్లో భారీ డిమాండ్ ఉంది. 1800లలో ఈ జాతి బ్రెజిల్‌కు ఎగుమతి అయ్యాయి.
15 - Vaca mais cara
— Viagem ao Passado (@viagempassado) November 9, 2024
A vaca mais cara do mundo custa 21 milhões de reais. É a goiana Viatina 19 pic.twitter.com/Kf2mHIKpQz
కండరాల నిర్మాణం, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వీటిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. తాజాగా బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్‌లో జరిగిన వేలంలో నెల్లూరు జాతికి చెందిన వియాటినా-19 ఆవు 4.8 మిలియన్ డాలర్ల(సుమారు రూ.40 కోట్లకు పైగా)కు అమ్ముడుపోయింది. వియాటినా-19 సుమారు 1,101 కిలోల బరువు ఉంది. ధర పలికి ఔరా అనిపించింది.
Also Read: Sai Pallavi: తండేల్ జాతర.. చైతన్యతో సాయి పల్లవి చిట్ చాట్.. చై కోసం పల్లవి ఇంట్రెస్టింగ్ పోస్ట్
ఇదే వేలంలో జపాన్‌కు చెందిన వాగ్యు, మన దేశంలో బ్రాహ్మణ్ పేరు గల ఆవులకు గతంలో రికార్డు ధరలు దక్కాయి. వియాటినా-19 అత్యధిక ధర పలికిన ఆవుగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంది. అంతేకాదు, గతంలో కండరాల నిర్మాణం, అత్యంత అరుదైన జన్యువులు కలిగి ఉన్నందుకు గానూ ‘ఛాంపియన్స్ ఆఫ్ ది వరల్డ్’లో ‘మిస్ సౌత్ అమెరికా’ పురస్కారమూ పొందింది. పశు సంపద పెంచేందుకు గానూ వియాటినా-19 అండాలను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నారు.
Also Read: Life Style: పడుకునే ముందు వీటిలో ఒకటి తాగడం మర్చిపోవద్దు! ఎందుకంటే..