ఏపీలోని నెల్లూరులో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులు కూడా కళాశాల వద్దకు వచ్చారు. యాజమాన్యం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆరోపణలు చేశారు. కళాశాల బయట విద్యార్థి సంఘాలతో కలిసి నిరసనకు దిగారు. విద్యార్థి సంఘాల నేతలు కాలేజ్ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులని అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకోని విచారణ చేపట్టారు. కళాశాలలో ఆందోళనలు నెలకొనడంతో యాజమాన్యం విద్యార్థులను ఇళ్లకు పంపించింది.
Also Read: ఎన్నికల సంఘంపై యుద్ధం.. మరో సంచలన డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ
ఇదిలాఉండగా హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో ఆదివారం మరో దారుణం జరిగింది. హఫీజ్ పేటలో ఓ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. శ్రీనివాస్ (36) అనే వ్యక్తి భవన నిర్మాణ కర్రల వ్యాపారం చేస్తున్నాడు. అయితే అతడి పక్క దుకాణదారుడైన సోహైల్, అతడి మామ కత్తులతో శ్రీనివాస్‌పై దాడులు చేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: పాపం..పెళ్లైన రెండు రోజులకే గుండెపోటుతో వరుడు మృతి