హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గుండె సమస్యలతో నిన్న మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ బై నాన్న అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. మీరు ఒక పెద్ద ఫైటర నాన్న.. మా కోసం మీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేశారు. ప్రేమించడం, జీవితాన్ని గెలవడం నాకు నేర్పించారు. ఈ స్థాయిలో ఈ రోజు నేను ఉన్నా అంటే కారణం మీరు కారణం. ప్రజలను ప్రేమించడంతో పాటు.. మంచి కోసం పోరాడాలనే విషయం నేర్పారు. ఎన్ని కష్టాలున్నా కూడా.. అవన్ని మా వరకు తీసుకురాకుండా పెంచారు. మీతో నాకు జీవితాంతం మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇంకా నాకు ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు.. బై నాన్నా అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఇది కూడా చూడండి: TG Group-3: నేడే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!
ఇది కూడా చూడండి: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల్లో డబ్బు అంటూ.. నిరుద్యోగ అబ్బాయిలే టార్గెట్
తెలుగు దేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా..
రామ్మూర్తి నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుకి సోదరుడు. అనారోగ్య సమస్యల కారణంగా హైదరాబాద్‌లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వెంటి లేటర్‌పై చికిత్స పొందుతూ రామ్మూర్తి నాయుడు మరణించారు. ఇతను 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఇది కూడా చూడండి: ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’
1999 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి గల్లా అరుణకుమారి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత అనారోగ్య కారణాలతో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రామ్మూర్తి నాయుడు 1952లో నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతులకు జన్మించాడు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు నటుడు నారా రోహిత్ కాగా, మరొకరు గిరీష్. ఇటీవల నారా రోహిత్‌కి హీరోయిన్ శిరీషాతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చూడండి: చైనాలో దారుణం.. కత్తి దాడిలో 8 మంది మృతి