/rtv/media/media_files/2025/06/24/gadwal-murder-case-2025-06-24-16-34-59.jpg)
Nandyal Surveyor Tejeshwar Murder case sensational facts
ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ మర్డర్ కేసులో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ హత్య కేసులో ప్రధాన కుట్రదారుడిగా ఉన్న బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు.. ముందుగా తన ప్రియురాలు ఐశ్వర్య భర్త తేజేశ్వర్‌ని కాకుండా తన భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరోక ఇన్సిడెంట్ కొత్త అనుమానాలకు తావిస్తోంది.
Surveyor Tejeshwar Murder
ఐశ్వర్య అన్న నవీన్ రెండు నెలల క్రితం ఇంట్లో జారిపడి మృతి చెందాడు. అయితే అప్పట్లో నవీన్ మృతిని అందరూ సాధారణంగానే భావించారు. కానీ ఇప్పుడు తేజశ్వర్ హత్య నేపథ్యంలో నవీన్ మృతిపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు జరిగిన హత్య ఘటనతో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తల్లి సుజాత, చెల్లి ఐశ్వర్య ఇద్దరూ బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో సాన్నిహిత్యంగా ఉండటాన్ని ఐశ్వర్య అన్న నవీన్ గుర్తించాడని.. ఆ విషయం తెలిసి అతడు జీర్ణించుకోలేకపోయాడని కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమ సంబంధం వ్యవహారంపై నవీన్ తన చెల్లి ఐశ్వర్యతో గొడవ పడ్డాడని.. చాలా సార్లు మందలించాడని తెలిసింది. ఈ క్రమంలోనే నవీన్ రెండు నెలల క్రితం ఇంట్లో జారిపడి మృతి చెందడం.. ఇప్పుడు అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తోంది. మరి ఈ హత్యను తల్లి, చెల్లీ చేశారా? లేక అతడు నిజంగానే జారి పడి మృతి చెందాడా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: కాల్పుల విరమణకు బ్రేక్.. ఇజ్రాయెల్‌పై మళ్లీ ఇరాన్ దాడులు
Follow Us