Nandamuri Family: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్డీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. నందమూరి పద్మజ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు స్వయాన సోదరి.

New Update
PADMAJA

Nandamuri Padmaja

ప్రముఖ సినీ నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. NTR పెద్ద కోడలు, ఆయన రెండవ కుమారుడు నందమూరి జయకృష్ణ(Nandamuri Jayakrishna) సతీమణి పద్మజ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, మంగళవారం (ఆగస్ట్ 19) తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

పద్మజ గారికి 73 సంవత్సరాలు. ఆమె మృతితో నందమూరి కుటుంబంలో, అలాగే వారి అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ చిన్నతనంలోనే మరణించడంతో, రెండో కుమారుడైన జయకృష్ణ కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్నారు.

Also Read :  మంగళగిరిలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు

Nandamuri Jayakrishna Wife Padmaja Passes Away

Also Read :  లవర్ ను దింపేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా.. స్పాట్ లోనే ఇద్దరూ!

పద్మజ(Padmaja) మృతి వార్త తెలిసిన వెంటనే నందమూరి కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి సహా పలువురు ప్రముఖులు ఆమె నివాసానికి బయలుదేరారు. ఎన్టీఆర్ కుటుంబానికి, దగ్గుబాటి కుటుంబానికి మధ్య ఉన్న బంధం కారణంగా ఈ మరణం మరింత బాధాకరంగా మారింది. పద్మజ దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి.

కుటుంబంలో పెద్దగా, ప్రతి శుభకార్యం, వేడుకల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించే పద్మజ గారి మరణం నందమూరి కుటుంబానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సుమారు రెండేళ్ల క్రితం చైతన్యకృష్ణ హీరోగా బ్రీత్‌ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.  ఈ చిత్రాన్ని తన తండ్రి జయకృష్ణ నిర్మిచారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం రూ. 5 లక్షలు కూడా కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు.

Advertisment
తాజా కథనాలు