జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. జనసేన తరఫున నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. ఇది కూడా చూడండి: బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు తాజాగా ఈ అంశం పెండింగ్‌లో పడినట్లు తెలుస్తోంది. నాగబాబు మంత్రిపదవిపై పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నాగబాబును మొదట మంత్రిని చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీ కట్టబెడతానని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పవన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: అంతర్జాతీయ క్రికెట్కు ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ నాగబాబును ముందుగా ఎమ్మెల్సీ చేయాలి నాగబాబును ముందుగా ఎమ్మెల్సీగా తీసుకొని.. ఆ తర్వాత మంత్రి పదవిని ఇవ్వాలని చంద్రబాబుకు పవన్ సూచించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. మరోవైపు కొందరు వైసీపీ ఎమ్మెల్సీలు పదవికి చేసిన రాజీనామాలు మండలి ఛైర్మన్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అవి ఆమోదం పొంది ఎన్నికల సంఘం బై ఎలక్షన్స్ ప్రకటిస్తే.. అప్పుడు అందులోంచి ఒకటి నాగబాబుకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ మార్చిలో మరో నలుగురు ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనుండగా.. ఆ తర్వాత అయినా నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం రానున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. దీంతో మెగా బ్రదర్ నాగబాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాలంటే మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. ఇది కూడా చూడండి: లెస్బియన్స్‌తో సహజీవనం చట్టబద్ధమే.. హైకోర్టు సంచలన తీర్పు