నాగబాబు ప్రమాణం అప్పుడే | Nagababu Oath Ceremony Updates | Pawan Kalyan | CM CHandrababu | RTV
నాగబాబును ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు రీసెంట్గా ప్రకటించారు. అయితే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జనసేన వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
ఏపీ మంత్రి వర్గంలోకి కొణిదెల నాగబాబు అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జనసేన తరఫున మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. మొన్నటి వరకు రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఏపీ కేబినెట్లోకి నాగబాబు పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
మెగా బ్రదర్ నాగబాబు చేసిన వరుస ట్వీట్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. నేరం ఏదైనా కోర్టు నిర్ధారించేంత వరకు ఎవరూ నిందితులు కాదు. విన్న ప్రతిదీ నమ్మొద్దు అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్లు జానీ మాస్టర్ కేసు గురించేనా? అని చర్చ జరుగుతోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్‌పై నటుడు నాగబాబు ప్రశంసలు కురిపించారు. ‘ఇప్పటికైనా అర్థమైందా.. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది’ అన్నారు. రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు తెలిపారు.
నటి నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, నాగబాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ 'పరువు'. తాజాగా ఈ సీరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కులం, పరువు కారణంగా ఇద్దరు ప్రేమికులకు ఎదురైన సంఘటనలు, సమస్యల నేపథ్యంలో ఆసక్తికరంగా సాగింది ఈ ట్రైలర్.
ఓటమి భయంతో వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దన్నారు. కచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందంటూ నాగబాబు వీడియో రిలీజ్ చేశారు.