/rtv/media/media_files/2025/07/31/mro-who-wanted-to-fulfill-a-wish-2025-07-31-18-43-24.jpg)
MRO who wanted to fulfill a wish..VRO who called him to his house and beat him up...
AP Crime:
తన కామ కోరిక తీర్చమని ఓ గ్రామ రెవెన్యూ అధికారిణి (వీఆర్ఓ)ను వేధించాడో ఎమ్మార్వో. అక్కడితో ఆగకుండా ఆమె ఇంటికే వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలిసి వీఆర్ఓ తల్లి ఎమ్మార్వోపై చెప్పు చీపురుతో దాడి చేసింది. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తిరుపతి జిల్లా.. సూళ్లూరుపేటలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటికి వచ్చి బట్టలు విప్పి కోరిక తీర్చాలంటూ మహిళా VROను వేధించిన MRO
— RTV (@RTVnewsnetwork) July 31, 2025
మీ ఇంటికి వస్తా.. కోడికూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా? అని మెసేజ్‌లు పెట్టిన MRO
తిరుపతి జిల్లాలో ఓ VRO ను రోజు ఆఫీస్ లో వేధిస్తూ.. సరాసరి తన కోరిక తీర్చమని ఆమె ఇంటికి వెళ్లి వేధించిన MRO
విషయం తెలిసి… pic.twitter.com/PkI4FS3fqa
సూళ్లూరు పేట ప్రాంతంలోని వాకాడు తహసీల్దార్ గా పనిచేస్తున్న రామయ్య గతంలో పెళ్లకూరు తహసీల్దార్ గా పనిచేశాడు. ఆ సమయంలోనే పెళ్లకూరు వీఆర్ఓ గా పనిచేస్తున్న ఒక మహిళా వీఆర్ఓ పై కన్నేశాడు. పలుమార్లు ఆమెను లైంగికంగా వేధించాడు. అయితే ఆ తర్వాత రామయ్యకు వాకాడుకు బదిలీ అయింది. అయినా ఆమెను వేధించడం మానలేదు. ఫోన్లో అసభ్య మెసేజులు పంపించడంతో పాటు న్యూడ్ కాల్స్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. 'మీ ఇంటికి వస్తా, కోడికూర వండిపెడతావా? అడిగింది ఇస్తావా?' అంటూ ఫోన్ లో మెస్సేజ్ లు పంపడమే కాకుండా బుధవారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చమని, నగ్నంగా నిలబడి వీఆర్ఓ ను వేధించినట్లు వీఆర్ఓ ఆరోపించారు.
ఇది కూడా చదవండి:BIG BREAKING: జగన్ నెల్లూరు టూర్ లో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై లాఠీ ఛార్జ్!
ఈ విషయం ముందే తన తల్లికి చెప్పి ఉంచింది వీఆర్ఓ. రామయ్య తన గదిలోకి వచ్చి బట్టలు విప్పగానే తల్లిని పిలిచింది. దీంతో తల్లి ఆ అధికారిపై చెప్పు , చీపురుతో దాడి చేసింది. దీంతో నగ్నంగా ఉన్న అధికారి వెంటనే బట్టలు వేసుకుని పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది, నగ్నంగా ఉన్న ఎమ్మార్వో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అంతా అవక్కాయ్యారు.
ఇది కూడా చదవండి:Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి ఫాంహౌస్‌పై సిట్ అధికారుల రైడ్స్
అయితే రామయ్య కథనం మరోలా ఉంది.ఆయన గతంలో పెళ్లకూరు తహసీల్దార్ గా పనిచేస్తున్న సమయం లో ఆయనకు వీఆర్ఓకు మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆమె తల్లి ఇంట్లో లేని సమయంలో పలుమార్లు వారింటికి రామయ్య వెళ్లాడని తెలుస్తోంది. అయితే రామయ్య అక్కడి నుంచి వాకాడుకు బదిలీ కావడంతో ఇద్దరిమధ్య లైంఘిక సంబంధం బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. అయినా ఆమెపై మోజు తీరని రామయ్య తరచూ పోన్ చేయడం, మెసెజ్ లు చేయడంతో వీఆర్ఓ తన ఇంటికి పిలిపించి దాడి చేసిందని ఆయన ఆరోపిస్తున్నాడు. కాగా ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అన్ని కోణాల్లోనూ విచారణ జరిపి రామయ్య, వీఆర్ ఓ విషయంలో చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారు.