/rtv/media/media_files/2025/04/21/HGQw5bRl0KHhjmHOez9T.jpg)
Raj Kasireddy
Raj Kasireddy:
AP లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి ఫాంహౌస్‌పై బుధవారం తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని రాజ్ కసిరెడ్డికి చెందిన సులోచన ఫాంహౌస్‌పై రైడ్స్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌లోని రాజ్ కసిరెడ్డి ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా రూ.11 కోట్ల నగదు సీజ్ చేశారు సిట్ అధికారులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు .. నిందితుడి సమాచారంతో రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న సిట్
— RITAM TELUGU (@RitamTelugu1) July 30, 2025
...
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారులు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుపుతూ ఈరోజు వేకువజామున భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో… pic.twitter.com/WgBviZoaZp
లిక్కర్ స్కామ్ లో ఏ40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు దాడులు చేశారు. 12 పెట్టల్లో భారీగా నగదు గుర్తించారు ఏపీ సిట్ పోలీసులు. 2024 జూన్‌లో ఈ డబ్బులు దాచిపెట్టినట్లు సిట్ అధికారులు తెలిపారు. సులోచన ఫాంహౌస్ ప్రొ. బాల్‌రెడ్డి పేరు మీద ఉంది. లిక్కర్ స్కామ్ A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆదేశాలతో వరుణ్, చాణిక్యలు ఆ డబ్బు దాచిపెట్టినట్లు సిట్ విచారణలో తేలింది.
ఏపీ మద్యం కేసులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు*
— MC RAJ🕊️ (@BeingMcking_) July 30, 2025
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలో నగదు పట్టివేత - సులోచన ఫార్మ్స్ గెస్ట్ హౌస్ లో 12 అట్టపెట్టల్లో దాచిన నగదు పట్టి - వేత రాజ్ కసిరెడ్డి సూచనల మేరకు నగదును 12 బాక్సుల్లో ఉంచినట్లు గుర్తింపు pic.twitter.com/3VmDJDHcK0
రాజ్ కసిరెడ్డి పాత్ర..
ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను కూడా గతంలో అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దిలీప్ చెన్నై నుంచి దుబాయ్ పారిపోతుండగా ఎయిర్‌పోర్టులోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయన్ని విజయవాడకు తరలించారు.
ఈ కేసులో ఏ1 నిందితుడు రాజ్ కసిరెడ్డి పీఏ మల్లేశ్ మొబైల్‌కు SOM డిస్టిలరీస్ అధ్యక్షుడు దివాకరం పంపిన వాట్సాప్ మెసేజ్‌లను అధికారులు గుర్తించారు. ఏ8 చాణక్య, ఏ7 అవినాశ్ రెడ్డి, ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి, ఏ9 కిరణ్‌తో ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. వైసీపీ ఆగ్రోకు చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వాట్సాప్‌లో.. రాజ్ అంకుల్ రెండు, మూడు రోజుల్లో అందుబాటులో ఉంటారా ? వారి వార్షిక లైసెన్సు ఫీజు పునరుద్ధరణ, గత నెల పనితీరుపై మాట్లాడేందుకు టైం చెప్పండని మల్లేశ్ ఫోన్‌కు పంపించారు.
మిథున్ రెడ్డి..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్టు అయ్యారు. మిథున్ రెడ్డికివిజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితేరిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్ కేసులో స్పష్టంగా మిథున్ రెడ్డి పాత్ర కనిపిస్తోంది. మనీ ట్రయల్‌తో పాటు కుట్రదారుడుగా సిట్ మిథున్ రెడ్డిని పేర్కొంది. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది.