BIG BREAKING: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు!

దువ్వాడ శ్రీనివాస్‌పై శ్రీకాకుళం హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చాను అన్న  పవన్‌ ఇప్పుడు నెలకు రూ.50 కోట్ల చంద్రబాబు నుంచి తీసుకుంటూ ప్రశ్నించడం లేదని విమర్శలు చేయడంతో జనసేన నాయకుడు ఫిర్యాదు చేశాడు.

New Update
Duvvada

Duvvada

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. దువ్వాడ ఈ ఏడాది ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వగా అందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చాను అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ అన్నారు. దీనికి నెలకు రూ.50 కోట్ల చొప్పున సీఎం చంద్రబాబు నుంచి తీసుకుంటూ ప్రశ్నించడం లేదని దువ్వాడ ఓ ఇంటర్వ్యూలో విమర్శలు చేశారు. దీనిపై హిరమండలం జనసేన నాయకుడు వంజరాపు సింహాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: జగన్ నెల్లూరు టూర్ లో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డిపై లాఠీ ఛార్జ్!

మార్చి 8న ఫిర్యాదు చేయడంతో..

ఎమ్మెల్సీ దువ్వాడపై చొర్లంగ జనసేన నాయకుడు వంజరాపు సింహాచలం మార్చి 8వ తేదీన హిరమండలం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇప్పుడు వివిధ సెక్షన్ల కింద పోలీసులు దువ్వాడపై కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి టెక్కలి సమీపంలోని దువ్వాడ నివాసంలో శనివారం నోటీసులు అందజేశారు.వైసీపీ పార్టీలో ఉన్న దువ్వాడను ఇటీవల పార్టీ నుంచి తొలగించింది. దువ్వాడ వ్యక్తిగత విషయంలో వచ్చిన సమస్యల వల్ల వైసీపీ పార్టీ నుంచి తొలగించినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: కూటమి పొత్తుతో ఫస్ట్ దెబ్బ నాకే.. ఎంపీ సీటు వదిలేసుకున్నా.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

దువ్వాడ శ్రీనివాస్ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలికి చెందినవారు. ఎంఏ ఇంగ్లీషు లిటరేచర్ కంప్లీట్ చేసి, బీఎల్ చేసి లాయర్ పట్టా అందుకున్నారు. 2001లో శ్రీకాకుళం యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా చేరారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలో చేరి అసెంబ్లీకి పోటీ చేశారు. ఈ సమయంలో కూడా ఓడిపోయారు. గత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస రావును వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాడు. శాసనసభ్యుల కోటాలో దువ్వాడ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. అయితే పార్టీ క్రమశిక్షణ, రూల్స్ ఉల్లంఘించినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతో వైసీపీ పార్టీ నుంచి దువ్వాడను సస్పెండ్ చేశారు.

Advertisment
తాజా కథనాలు