/rtv/media/media_files/2025/10/04/misconduct-in-food-distribution-program-2025-10-04-17-49-44.jpg)
Misconduct in food distribution program
visakhapatnam: విశాఖపట్నంలో దుర్గాదేవి మండపం వద్ద అపశ్రుతి చోటుచేసుకుంది. మరుగుతున్న గంజి మీద పడటంతో 16 మంది చిన్నారులు సహా మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఈ ఘటన విశాఖలోని జాలరిపేట పిల్లా అప్పమ్మయ్య సంఘం వద్ద చోటుచేసుకుంది.ఈ సంఘం వద్ద దసరా సందర్భంగా మండపం ఏర్పాటు చేసి దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. శనివారం రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడానికి మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే వంట చేస్తున్న ప్రాంతంలో ప్రమాదవశాత్తూ మరుగుతున్న వేడి గంజి అక్కడే ఉన్న చిన్నారులు, మహిళలపై పడింది. ఈ ఘటనలో 16 మంది చిన్నారులు సహా మహిళలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: గుండెపోటుతో లండన్‌లో తెలంగాణ యువకుడి మృతి
ఈ ఘటనపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. మిగిలిన 10 మందికి ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించాలని వైద్యులు నిర్ణయించారు. ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ఛైర్మన్ సీతంరాజు సుధాకర్ తదితరులు గాయపడిన చిన్నారులను విశాఖ కేజీహెచ్‌లో పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందుతుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
Also Read : ప్రియురాలిని హత్య చేసి బ్లూ డ్రమ్ములో కుక్కిన ప్రియుడు.. ఎందుకంటే?
ఇది కూడా చూడండి: Amazon, Flipkart sale: ఐఫోన్లు 'Out of stock' కాకుండా ఉండటానికి 5 సింపుల్ ట్రిక్స్!