/rtv/media/media_files/2025/04/19/B9OPWpvXo6AJkMILKTWF.jpg)
Medico suicide
Medico suicide : విశాఖపట్నంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కాలేజీ భవనం మీద నుంచి దూకి ఓ మెడికో ఆత్మహత్య చేసుకున్నారు. అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. శ్రీరామ్ అనే మెడిసిన్ చదువుతున్న విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. కాలేజీ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు శ్రీరామ్ ఆత్మహత్యకు కాలేజీ వైఎస్ ప్రిన్సిపల్ వేధింపులే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్య కి పాల్పడినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
విద్యార్థి ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మెడికో విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సంఘటన స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు విద్యార్థులను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా మెడికో విద్యార్థి శ్రీరామ్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసును విచారిస్తున్నారు.దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఏదేమైనా మంచి భవిష్యత్తు ఉన్న విద్యార్థి ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడంపై తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే విద్యార్థి సెమిస్టర్ ఎగ్జామ్‌లో స్లిప్‌లు పెట్టుకుని రాస్తుండగా.. వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో అవమాన భారంతో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నట్లు కాలేజీ యాజమాన్యం చెబుతోంది.
విజయవాడకు చెంది శ్రీరామ్ దత్త ప్రణీత్(23) భీమిలి సంగివలస ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఎంబీఏ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. శ్రీరామ్ స్లిప్పులు పెట్టుకుని సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తుండగా వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో అవమానంగా భావించిన శ్రీరామ్.. కాలేజీ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని భీమిలి పోలీసులకు తెలియజేయగా.. వారు వెంటనే ఘటనా స్థలికి వచ్చారు. శ్రీరామ్ మృతదేహాన్ని పరిశీలించి.. కాలేజీ మార్చురీలోనే వుంచారు.
వైస్ ప్రిన్సిపాల్ వేధింపులే కారణమా..
ఇదిలాఉంటే శ్రీరామ్ మృతికి వైస్ ప్రిన్సిపాల్ వేధింపులే కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగానే శ్రీరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Canada: కెనడాలో కాల్పులు..భారతీయ విద్యార్థిని మృతి!
NRI మెడికల్ కళాశాలలో దారుణం.. కాలేజీ భవనం మీద నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
— RTV (@RTVnewsnetwork) April 19, 2025
వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపుల కారణంగానే ఆత్మహత్య కి పాల్పడ్డాడంటూ ఆందోళన చేపడుతున్న NRI మెడికల్ కాలేజీ విద్యార్థులు #MedicoStudent #Vizag #AndhraPradesh #RTV pic.twitter.com/kvfzyqisO6