/rtv/media/media_files/2025/03/22/tzYkXMFWHOpAv4ekaCnN.jpg)
Pakistan PM Shehbaz Sharif
ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ భారత్‌ను ఏదో ఓ రకంగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోరు పారేసుకున్నారు. పాకిస్థాన్ న్యూక్లియర్ ప్రొగ్రామ్ కొనసాగుతుందని ఆయన అన్నారు. దేశ రక్షణ కోసం వాటిని వినియోగిస్తామంటూ పరోక్షంగా భారత్‌ను హెచ్చరించాడు. ఇస్లామాబాద్‌లోని విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
“Pakistan’s PM: No nuclear escalation during Op Sindoor—just measured, disciplined defense.”
— Akshansh Tyagi | GeoStrategy (@AkshanshTyagi5) July 13, 2025
Clear stick-and-carrot: India warns, Pakistan reassures.#indiapakistanconflict#NuclearBalance
పాక్ పై దాడి చేసే సీన్ భారత్‌కు లేదంటూ ఆ దేశ ప్రధాని పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడాడు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ఆయన ప్రస్తావించారు. ఆపరేషన్ సింధూర్‌లో భారత్ వైమానికి దాడుల కారణంగా 55మంది పాక్ పౌరులు ప్రాణాలు కోల్పోయారంటూ షెహబాజ్ షరీఫ్ దొంగ ఏడుపులు మొదలు పెట్టారు.
పాక్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ గురించి కూడా ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని బలవంతంగా దించేసి మునీర్ ఆ స్థానాన్ని ఆక్రమించనున్నారంటూ వస్తున్న వార్తలను షరీఫ్ తోసిపుచ్చారు. అవన్నీ వదంతులని.. దేశాధ్యక్షుడు కావాలనే ఆకాంక్షను మునీర్ ఏనాడు వ్యక్తపరచలేదన్నారు.