Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 15 నుంచి మనమిత్ర కార్యక్రమానికి స్వీకారం చుట్టనుంది రాష్ట్రప్రభుత్వం. ఇంటింటికీ వచ్చి సచివాలయ సిబ్బంది 9552300009 ఫోన్ నెంబర్‌ను అందరి ఫోన్లో సేవ్ చేయనున్నారు. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై ప్రజ‌ల‌కు అవ‌గాహ‌న పెంచనున్నారు.

New Update
Mana Mitra program

Mana Mitra: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి నూతన కార్యక్రమం చేపట్టనుంది. వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై ప్రజ‌ల‌కు అవ‌గాహ‌న పెంచాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఇంటింటికీ సచివాలయ సిబ్బంది వెళ్లి అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నారు. అందరి ఫోన్ నెంబర్లలో 9552300009 నంబ‌రు మ‌న మిత్రపేరుతో స‌చివాల‌య సిబ్బంది సేవ్ చేయ‌నున్నారు.

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

జిల్లా క‌లెక్టర్లకు ఈ కార్యక్రమ ప‌ర్యవేక్షణ బాధ్యత‌లు అప్పగించారు. ప్రజ‌ల‌కు అవ‌గాహ‌న పెంచేలా ప్రత్యేక క‌ర‌ప‌త్రం, వీడియో సందేశం లాంటి వాటితో ప్రచారం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రతి ఒక్కరూ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఉప‌యోగించుకునేలా కృషి చేయనున్నారు. ఇందుకుగాను ఐటీ, రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ శాఖ‌ అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది.

Also read: Pavan kalyan son : అప్పుడు తెలియలేదు.. విషయం ఇంత సీరియస్ అని : పవన్ కళ్యాణ్

ప్రస్తుతం వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 250కి పైగా సేవ‌లందిస్తోంది. జూన్ నెల‌కు వరకు 500లకుపైగా సర్వీసులు అందించే దిశ‌గా చ‌ర్యలు తీసుకుంటున్నారు. తర్వాత దాన్ని 1000కి పెంచాలని ఏపీ ప్రభుత్వ లక్ష్యం.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

Advertisment
తాజా కథనాలు