Dubai Crown Prince: ఢిల్లీకి చేరుకున్న అత్యంత సంపన్నుడు దుభాయ్ రారాజు.. ఎందుకంటే?

భారత్ పర్యటనలో భాగంగా దుబాయ్ రాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఏప్రిల్‌ 8, 9ల్లో ఆయన‌తోపాటు ఆ దేశాధిపతులు భారత్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి. దుభాయ్ రాజు అత్యంత ధనవంతుడు.

New Update
Dubai Crown Prince

Dubai Crown Prince Photograph: (Dubai Crown Prince)

దుబాయ్ రాజు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఏప్రిల్‌ 8, 9 రెండు రోజుల  పాటు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. షేక్ హమ్దాన్ కోసం ప్రధాని మోదీ విందును ఏర్పాటు చేశారు. అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో చర్చలు జరపనున్నారు. దుబాయ్ రాజుతోపాటు ఉప ప్రధాన మంత్రి, రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ కూడా ఇండియాకు వచ్చారు.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

ఇండియాలో ఇది ఆయన మొదటి అధికారిక పర్యటన. ఈ పర్యటన భారతదేశం-, దుబాయ్ ల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం, పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో వాణిజ్య సంబంధాల విస్తరణ, రక్షణ సహకారం,  స్టార్టప్ ఇకోసిస్టమ్,  పెట్టుబడుల పెంపు వంటి అంక్షాల్లో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి. షేక్ హమ్దాన్ బిన్ 2008 నుంచి దుబాయ్ ప్రిన్స్‌గా చెలామణి అవుతున్నాడు. అతని సోదరుడు షేక్ రషీద్‌ను ఆ పదవికి తిరస్కరించిన తర్వాత అతను దుబాయ్ రాజుగా బాధ్యతలు స్వీకరించాడు. రషీద్ 2015లో 33 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించాడు. 

షేక్ హమ్దాన్ 1982, నవంబర్ 14న దుబాయ్‌లో జన్మించారు. తొలుత ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో శిక్షణ పొందారు. తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిగ్రీ పొందారు. 2008లో దుబాయ్ క్రౌన్ ప్రిన్స్‌గా  ఎన్నికయ్యారు. యూఏఈ ఉప ప్రధాని, రక్షణ మంత్రిగానూ పనిచేస్తున్నారు.షేక్ హమ్దాన్ పేరు మీదనే సుమారు 4 బిలియన్ డాలర్లు అంటే అది మన ఇండియన్ కరెన్సీలో రూ. 33,500 కోట్లు. ఇది ఆయన కుటుంబ ఆస్తిలో కాదు. ప్రిన్స్ పర్సనల్ ఆస్తులు. షేక్ హమ్దాన్‌కు దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఖరీదైన బిల్డింగులు ఉన్నాయి. జాబీల్ ప్యాలెస్, బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఆధునిక రెసిడెన్షియల్ యూనిట్లు ఉన్నాయి. ఆయన వద్ద రూ.100 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కార్ల కలెక్షన్‌ ఉంది. అంతే కాదు ఆయన విదేశీ ప్రయాణాలకు ప్రైవేట్ జెట్‌లు కూడా ఉన్నాయి. అత్యంత అరుదైన జంతువులు ఆయన దగ్గర పెంపుడు జంతువులుగా ఉన్నాయి. వాటిలో తెల్ల పులులు, సింహాలు, ఒంటెలు, గుర్రాలు ఉన్నాయి. ఈ జంతువులను ఆయన దుబాయ్‌లోని తన ప్రత్యేక ఫామ్‌హౌస్‌లో పెంచుతారు. దుబాయ్‌ ‍క్రౌన్‌ ప్రిన్స్‌ వద్ద దుబాయ్ అనే సూపర్ యాచ్ ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాచ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీని విలువ సుమారు రూ. 4000 కోట్లు.

Advertisment
తాజా కథనాలు