/rtv/media/media_files/2025/04/02/sQVm38TNYm3OK9lv3QZi.jpg)
Waqf Bill
Waqf Amendment Act: పార్లమెంట్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2025 ఆమోదం పొందిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం ఆమోదించగా.. ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న విషయం ప్రకటించలేదు. దీంతో కేంద్రం ఈ అంశంపై క్లారిటీ ఇస్తూ ఈరోజు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈమేరకు నేటినుంచి (ఏప్రిల్ 8) నుంచి దేశంలో వక్ఫ్ సవరణ చట్టం అమలులోకి వచ్చింది. గతవారం పార్లమెంట్ ఉభయసభలు సవరణ చట్టాన్ని ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిన విషయం తెలిసిందే. కేంద్రం పంపిన వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ఏప్రిల్ 8న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లును ఆమోదించారు.
Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు
The Waqf (Amendment) Act, 2025 comes into effect from today.
— All India Radio News (@airnewsalerts) April 8, 2025
The government issues a notification to this effect following the assent given by President Droupadi Murmu to the legislation.#WaqfAmendmentAct pic.twitter.com/r4VPgOZmxO
Also read: Pavan kalyan son : అప్పుడు తెలియలేదు.. విషయం ఇంత సీరియస్ అని : పవన్ కళ్యాణ్
రెండు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. ఏప్రిల్ 4న రాజ్యసభ బిల్లుకు అనుకూలంగా 128 ఓట్లు, వ్యతిరేకంగా 95 ఓట్లు రాగా, లోక్‌సభ సుదీర్ఘ చర్చ తర్వాత ఏప్రిల్ 3న బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్‌సబలో 288 మంది ఎంపీలు అనుకూలంగా, 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. గతంలో ఉన్న చట్టం1995లో సవరించినది. కొత్తగా తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. ఎవరైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతనికి మాత్రమే సొంతమై ఉండాలి. సవరణ చట్టంలో ‘వక్ఫ్ బై యూజర్’ నిబంధన తొలగించారు.
Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు
వక్ఫ్ భూముల సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి కలెక్టర్‌కు బదిలీ చేశారు. వక్ఫ్ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. వక్ఫ్ బోర్డుల్లో ఇద్దరు స్త్రీలతో పాటు ఇద్దరు ముస్లిమేతర సభ్యులను సైతం చేర్చాల్సి ఉంటుంది. ట్రిబ్యునల్ నిర్ణయా మాత్రమే అంతిమం కాదు. 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇకపై వక్ఫ్ బోర్డులకు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్‌గా ప్రకటించే అధికారం ఉండబోదు.
Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’