తన కొడుకుకు సంభవించిన ప్రమాదం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు. సింగపూర్‌లోని ఓ సమ్మర్ క్యాంప్‌లో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అక్కడే ఉన్నాడు. ఈ ఫైర్ యాక్సిండెంట్‌లో అతని చేతులు, కాళ్లకు గాయాలైయ్యాయని పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఈ విషయం గురించి ప్రధాని మోదీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారని ఆయన చెప్పారు.
Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’
ఈరోజు 9.30 ఫ్లైట్ కి సింగపూర్ వెళ్తున్నా ..
— RTV (@RTVnewsnetwork) April 8, 2025
4 రోజులు అక్కడే ఉంటా ..
లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి..
చేతులు బాగా కాలాయి.. - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్#PawanKalyan#Janasena#RTVpic.twitter.com/0Ct2YWrqQa
Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు
30 మంది పిల్లలు సమ్మర్ క్యాంప్‌లో ఉన్నప్పుడు ఫైర్ యాక్సిండెంట్ జరిగిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ పసిబిడ్డ చనిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఉదయం ఫోన్ వచ్చిందని.. అప్పుడు అది ఇంత సీరియస్ ఇష్యూ అని తెలియదని ఆయన అన్నారు. అయితే.. పెద్ద కొడుకు అకీరానంద్ పుట్టిన రోజే, చిన్న కొడుక్కి ఇలా జరగడం చాలా బాధగా ఉందని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్క్ శంకర్ హాస్పిటల్‌లో చిక్సిత తీసుకుంటున్నాడని జనసేన అధినేత తెలిపారు. మీడియా సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ విమానంలో సింగపూర్ బయలుదేరనున్నారు.