/rtv/media/media_files/2025/07/24/the-young-man-who-fell-in-love-with-aunt-2025-07-24-10-11-24.jpg)
A young man who fell in love with a woman much older than him
love couple : ప్రేమ గుడ్డిదే కాదు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది చిత్తూరుకు చెందిన ప్రేమజంట. 19 ఏళ్ల యువకుడు 39 ఏళ్ల ఆంటీతో ప్రేమలో పడ్డాడు. ప్రేమలో మునిగి ఇంటినుంచి వెళ్లిపోయి బెంగళూరులో కాపురం పెట్టారు. పోలీసుల జోక్యంతో ప్రస్తుతం ఎవరింటికి వారు చేరుకున్నారు.
Also Read: Bangladesh: ఎయిర్ క్రాష్ బాధితుల కోసం ముందుకు వచ్చిన భారత్..ఢాకాకు స్పెషల్ టీమ్
అతని వయస్సు 19 ఏళ్లు...ఆమె వయసు సరిగ్గా అతడి వయసుకు డబుల్..అంటే 38. అయితేనేం ఇద్దరూ ప్రేమలో పడ్డారు. వారిది చిత్తూరు. యువకుడు ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో మహిళ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. ఆమె భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. కాలేజీలో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. దీంతో మే 24న ఆ యువకుడు బెంగళూరులో ఇంటర్న్‌షిప్ కోసం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఆమెతో వెళ్లిపోయాడు.ఇద్దరూ బెంగళూరులో కాపురం పెట్టారు.
అయితే ఇంటర్న్‌షిప్ కోసం వెళ్లిన కొడుకు ఎన్నాళ్లయినా రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఫోన్‌చేస్తే ఆన్సర్ లేదు. వెంటనే స్నేహితులను ఆరాతీశారు. దీంతో మేడంతో లవ్ స్టోరీ బయటకు వచ్చింది. జులై 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు రెండో పట్టణ సీఐ నెట్టికంఠయ్య అదే రోజు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. బెంగళూరులో ఉన్నారని తెలుసుకుని, ఇద్దరినీ గుర్తించి బుధవారం చిత్తూరుకు తీసుకొచ్చి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇద్దరినీ వారి ఇళ్లకు వేర్వేరుగా పంపించారు. మరి వీరిద్దరూ అలాగే ఉంటారో మళ్లీ లేచిపోతారో కాలమే నిర్ణయిస్తుంది.
Also Read: షాకింగ్ వీడియో.. యువతిని ఉతికారేశాడు - కడుపులో తన్ని, జుట్టు పట్టుకుని ఈడ్చేసిన యువకుడు!