/rtv/media/media_files/2025/04/22/LnrAx44ynrv4FnEvghUP.jpg)
Vijayasai Reddy
Vijayasai Reddy : ఏపీ లిక్కర్ స్కాం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ సాయి రెడ్డి ఎక్స్‌లో చేసిన ట్విట్‌లో సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కాంలో తన పాత్ర లేకున్నా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దొరికిన దొంగలు దొరకని దొంగలు తన పేరును లాగుతున్నారని ఆరోపించారు. ఒక రూపాయి కూడా తాను ముట్టలేదన్న విజయసాయిరెడ్డి దొంగలు సగమే బట్టలు విప్పారని వారి మిగతా బట్టలు విప్పేందుకు తాను సహకరిస్తానని ట్విట్ చేశారు. కాగా ఆయన ట్విట్ ఇప్పుడు సంచలనంగా మారింది.
Also Read : సూర్యపేటలో హైటెన్షన్.. రోడ్డుపై ధాన్యం తగలబెట్టిన రైతులు.. ఏం జరిగిందంటే!
ఆయన ట్విట్...
"ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.''
Vijayasai Reddy Tweet
ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 22, 2025
కాగా మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఎవరెవరికి లింక్స్ ఉన్నాయనే కోణంలో సిట్ కూపి లాగుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఇప్పటికే సిట్ అధికారులు..కీలక ఆధారాలు సేకరించారు.ఈ కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసీరెడ్డి ని అరెస్టు చేసి అర్ధరాత్రి నుండి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో... ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీసీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డి తో పాటు మరి కొంతమంది అధికారులను విచారణకు పిలిచిన సిట్ అధికారులు వారి స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. .ఇప్పటికే ఈ కేసులో ప్రైమరీ ఎవిడెన్స్ ను పూర్తిస్థాయిలో సీఐడీ అధికారులు సేకరించారు.
ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..
అటు సిఐడి అధికారుల సేకరించిన ఆధారాలు, ఇటు సిట్ అధికారులు సేకరించిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా రాజ్ కేసిరెడ్డి పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు విచారణ కీలక దశలో ఉండగా.. మాజీ ఎంపీ విజయసారీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కాగా తనను విచారణకు పిలిచిన సమయంలో లిక్కర్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి రాజ్ కేసిరెడ్డి అని విజయ్ సాయి రెడ్డి సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిస్తోంది. తాజాగా రాజ్ కేసిరెడ్డిని విచారిస్తున్న సమయంలో... తన ట్వీట్ ద్వారా విజయ్ సాయి రెడ్డి మరో బాంబు పేల్చారు. విజయ్ సాయి రెడ్డి ట్వీట్ తో రాజ్ కేసిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుంది.కాగా విచారణలో రాజ్ కేసిరెడ్డి ఎవరి పేర్లు చెబుతారో అనే ఉత్కంఠ వైసీపీ నేతల్లో నెలకొంది.
Also Read: Ap Tenth Results:రేపే ఏపీ టెన్త్ రిజల్ట్స్!
Also Read: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ డెత్ రిపోర్ట్ వచ్చింది...అందులో ఏముందంటే..
ap-liquor-policy | vijayasai-reddy | vijayasai reddy news