అఘోరీ పర్యటన ఏపీలో కలకలం రేపుతుంది. ఆమె పర్యటనపై లాయర్ సాయికృష్ణ ఆజాద్ ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఎవరూ ఊహించని విషయాలు పేర్కొన్నారు. మరి ఆ లాయర్ రాసిన లేఖలో ఏముంది? అనే విషయానికొస్తే..
ALSO READ: అంబటి రాంబాబుపై చర్యలు.. టీడీపీ సంచలన ట్వీట్!
తెలంగాణ అంతటా అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ నుంచి వెళ్లిపోయిన అఘోరీ రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో దర్శనమిచ్చింది. ఊహించని విధంగా సోమవారం సాయంత్రం విశాఖ దగ్గరలో నక్కపల్లి మండలంలో హల్చల్ చేసింది. తన కారులో అన్నవరం నుంచి విశాఖవైపు వస్తూ వేంపాడు టోల్ ప్లాజా వద్ద ప్రత్యక్షమైంది.
Also Read : క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR
దీంతో ఆత్రంగా స్థానికులు, టోల్ ప్లాజా సిబ్బంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి తనపై చేయి వేసి, తాకరాని చోట తాకాడంటూ ఆమె గొడవకు దిగింది. అతనెవరో తనకు తెలియాలని, సీసీ కెమెరా పుటేజీ కావాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా లేడీ అఘోరీ మాట్లాడుతూ ఏపీలో కూడా మహిళలకు రక్షణ లేదని, నిత్యం శివ సాన్నిధ్యంలో వుండే తనపై అసభ్యంగా ప్రవర్తిస్తే, మహిళలకు రక్షణ ఎక్కడ వుంటుందని పేర్కొంది. తాను సనాతన ధర్మ పరిరక్షణ కోసమే కృషి చేస్తున్నానని తెలిపింది. ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గనని.. అవసరమైతే ప్రాణత్యాగం అయినా చేస్తానని చెప్పింది. తనలాంటి నాగ సాదువులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. ఈ లోగా అక్కడకు చేరుకున్న సీఐ కుమారస్వామి, ఎస్ఐ సన్నిబాబు ఆమెతో మాట్లాడారు.
Also Read : అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ఏపీ డీజీపీకి ఫిర్యాదు
ఏపీలో అఘోరీ పర్యటన కలకలం రేపుతుంది. ఆమె పర్యటనపై లాయర్ సాయికృష్ణ ఆజాద్ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అఘోరీకి భద్రత కల్పించాలని లాయర్ సాయికృష్ణ ఆజాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నక్కపల్లి టోల్‌గేట్ దగ్గర ఘటనపై ఆయన డీజీపికి ఫిర్యాదు చేశారు. అఘోరీ పర్యటనను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నించారని.. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు చేయి కూడా వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read : హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!
కార్తీక మాసంలో అఘోరీ శైవ క్షేత్రాల పర్యటన చేస్తోందని.. నక్కపల్లి ఘటన నేపథ్యంలో అఘోరీకి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల అఘోరీపై తెలంగాణ డీజీపీకి ఓ లాయర్ ఫిర్యాదు చేశాడు. మతవిధ్వేశాలను రెచ్చగొట్టేలా ఆమె మాట్లాడుతుందని.. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే.