శివరాత్రి రోజు శ్రీశైలంలో చిరుత పులి మృతి కలకలం

శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో చిరుత మృతి కలకలం రేపింది. రుద్రపార్కు సమీపంలో గోడపై చిరుతపులి చనిపోయి ఉండటాన్ని అటుగా వెళ్తున్న శివభక్తులు గుర్తించారు. పులి గోర్లు కట్ చేసి ఉండటం పలు అనుమానాలకు తావుతీస్తోంది.

New Update
srishilam tiger

srishilam tiger Photograph: (srishilam tiger)

శివరాత్రి పర్వదినాన శ్రీశైలంలో చిరుత మృతి కలకలం రేపింది. రుద్రపార్కు సమీపంలో గోడపై చిరుతపులి చనిపోయి ఉండటాన్ని అటుగా వెళ్తున్న శివభక్తులు గుర్తించారు. పులి గోర్లు కట్ చేసి ఉండటం పలు అనుమానాలకు తావుతీస్తోంది. పులిని చంపేశారా.. లేక దానంతట అదే అస్వస్థతకు గురై మరణించిందా అని తెలియదు. చిరుత మృతదేహం కుళ్లిపోయి ఉంది. దీంతో చనిపోయి ఎన్నిరోజుల అవుతుందో కూడా తెలియదు.

Also Read: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

అదే చిరుత శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డులో తరచుగా సంచరిస్తున్న స్నానికులు సమాచారం ఇచ్చారు. చిరుత పులి మృతదేహాన్ని చూసిన భక్తులు మొదట భయపడి.. తర్వాత అటవి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ ఆఫీసర్లు చిరుత మృతికి గల కారణాలేంటని ఆరా తీస్తున్నారు. 

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు