భార్య, ఆమె ప్రియుడి తలలు నరికి.. వాటితో పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త

తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. భార్య వివాహేతర సంబంధం చూసి తట్టుకోలేకపోయిన భర్త, ఆమెతోపాటు ప్రియుడిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా, వారి తలలను నరికి సంచిలో వేసుకుని నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

New Update
Tamila nadu crime

తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. భార్య వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని చూసి తట్టుకోలేకపోయిన భర్త, ఆమెతోపాటు ప్రియుడిని దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా, వారి తలలను నరికి సంచిలో వేసుకుని నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కల్లకురిచ్చి జిల్లాలోని మలైకొట్టలం గ్రామానికి చెందిన కూలి పనుల చేసుకునే కొలంజి (60) తన రెండో భార్య లక్ష్మి (40)తో కలిసి నివసిస్తున్నాడు. లక్ష్మి అదే గ్రామానికి చెందిన రైతు తంగరాసు (57)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం కొలంజికి తెలిసింది. అనేక సార్లు ఆమెను వారించినా ఫలితం లేకపోయింది. తన అక్రమ సంబంధాన్ని మానుకోవడానికి నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన కొలంజి, వారిద్దరినీ హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

గురువారం తెల్లవారుజామున, కొలంజి తన భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు తంగరాసు ఇంట్లో ఉన్న సమయంలో వారిని గొడ్డలితో దారుణంగా నరికాడు. ఇద్దరినీ చంపిన తర్వాత, వారి తలలు మొండెం నుంచి వేరు చేసి ఓ సంచిలో పెట్టుకున్నాడు. అనంతరం, ఆ సంచిని తీసుకుని కల్లకురిచ్చి జిల్లా పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు. పోలీసులకు ఈ విషయాన్ని వెల్లడించగా, పోలీసులు వెంటనే కొలంజి ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇంటి డాబాపై తలలు లేని రెండు మృతదేహాలు పడి ఉండటాన్ని గుర్తించారు. అనంతరం, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొలంజిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Advertisment
తాజా కథనాలు