AP Crime: వీడు కొడుకు కాదు రాక్షసుడు.. కన్నతల్లిని గొంతు కోసి చంపి.. శవాన్ని ఏం చేశాడంటే?

కడప జిల్లా ప్రొద్దుటూరులో కన్నతల్లిని ఓ కొడుకు గొంతు కోసి హతమార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లిని హత్య చేసిన యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా యశ్వంత్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.

New Update
Kadapa Poddutur Crime News

Kadapa Poddutur Crime News

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కన్నతల్లిని ఓ కొడుకు(son killed mother news) గొంతు కోసి హతమార్చిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మీదేవిని ఆమె కుమారుడు యశ్వంత్ తెల్లవారుజామున దారుణంగా హత్య చేశాడు. యశ్వంత్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున ప్రొద్దుటూరుకు వచ్చిన యశ్వంత్ ఇంట్లోకి వెళ్లి తల్లి లక్ష్మీదేవి గొంతు కోశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని గొంతు కోసిన స్థితిలోనే ఇంటి వరండాలోకి ఈడ్చుకొని వచ్చి పడేశాడు.

కన్నతల్లిని గొంతుకోసి చంపిన కొడుకు..

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లిని హత్య చేసిన యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా యశ్వంత్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: కామాంధుడి వేధింపులకు వివాహిత బలి.. పురుగుల మందు తాగి!

ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు తన తల్లిని హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. మానసిక సమస్యలే ఈ దారుణానికి కారణమా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: అల్లుడితో అత్త అక్రమ సంబంధం.. రోకలిబండతో కూతుర్ని బాదిన తల్లి!

Advertisment
తాజా కథనాలు