/rtv/media/media_files/tv9FnUjl4bVbvp7jPltu.jpg)
Jogi Ramesh arrested in fake liquor case?
Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు ఉచ్చు బిగుస్తోంది. జోగి రమేష్ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు చెప్పడంతో..ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిట్ బృందం సిద్ధమైంది. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆయన ఇంటికి సిట్ బృందం చేరుకుంది.రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు రామును పోలీసులు అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
నిందితులు విచారణలు, స్టేట్‌మెంట్లు కోర్టుకు ఇచ్చింది సిట్. వాళ్లిచ్చిన సమాచారం ఆధారంగా జోగి రమేష్‌ను నిందితుడిగా చేర్చారు దర్యాప్తు అధికారులు. ఇప్పటివరకు ఆరోపణలతో సరిపోయిన వివాదం కాస్త కోర్టు మెట్లెక్కబోతోంది. కీలక ఆధారాలు దొరికిన తర్వాతే జోగి రమేష్ పేరును చేర్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేశ్ ఇంటికి పోలీసులు వెళ్లినట్లు సమాచారం.
Also Read : అమెరికాలో భారత సంతతి వ్యక్తి బ్లాక్ రాక్ స్కామ్..500 మిలియన్ల టోకరా
ఇన్నాళ్లు కేవలం ఆరోపణలకు పరిమితమైన కేసులో జోగి రమేష్ పేరును నిందితుడిగా చేర్చడంతో లిక్కర్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. అయితే జోగి రమేష్ మాత్రం తనకు జనార్ధన్ రావు తెలియదని, నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అయితే జనార్ధన్‌రావుతో జోగి రమేష్ ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కల్తీ మద్యం కేసు ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సిట్ విచారణలో చెప్పిన పలు విషయాలతో జోగి రమేష్‌కు ఉచ్చు బిగిచినట్లేనని తెలుస్తోంది. జనార్ధన్ రావు స్టేట్‌మెంట్‌ను ఆడియో, వీడియో రికార్డింగ్‌తో పాటు లిఖిత పూర్వకంగా ఎక్సైజ్, సిట్ అధికారులు కోర్టుకు సమర్పించారు.
Also Read: నిశ్చితార్థానికి ముందు ఊహించని ట్విస్ట్! వధువు తండ్రితో వరుడి తల్లి జంప్
నకిలీ మద్యం కేసులో నిందితుడిగా చేర్చడంతో జోగి రమేష్ ఫైర్ అయ్యారు. తనకు లిక్కర్ కేసుతో సంబంధం లేదని దుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశానని..తాను తప్పు చేసినట్లు చంద్రబాబు, లోకేశ్ ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. కానీ అటునుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. సీబీఐ కాకపోతే దేశంలో ఏ సంస్థతో అయినా విచారణ జరపండి.. ఎవరో స్టేట్ మెంట్ ఇచ్చారని తనను అరెస్ట్ చేస్తే ఊరుకోనని జోగి రమేష్ అన్నారు. అక్రమంగా తనను జైలుకు పంపిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని..తాను పోరాటంలో ఎక్కడా తగ్గనని తేల్చి చెప్పారు.
జోగి రమేష్ అరెస్ట్ ఎప్పుడు?
ఇప్పటివరకు జోగి రమేష్ అరెస్టు కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా ఈ రోజు ఆయన ఇంటికి సిట్ బృందం వెళ్లడం చర్చనీయంశంగా మారింది. ఆయనను..అరెస్టు చేస్తారన్న ప్రచారంతో ఆయన అభిమానులు, వైసీపీ నేతలు జోగి ఇంటికి చేరుకుంటున్నారు. ఇక జోగి రమేష్ కూడా మానసికంగా అరెస్టుకు సిద్ధమయ్యారన్న టాక్ వినిపిస్తోంది.
Also Read:Pakistan: నీటికొరతతో పాకిస్తాన్ పాట్లు..సింధునది జలాలు లేక తీవ్ర నష్టం
Follow Us