Jagan Vs Pawan: టార్గెట్ పవన్.. బిగ్ స్కెచ్ వేసిన వైసీపీ.. ఆపరేషన్ షురూ!

ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబు, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా దాడిశెట్టి రాజా లను నియమిస్తూ బుధవారం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో జనసేనా కాపు ఓటు బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది.

New Update
ap kapu communuty

ap kapu communuty Photograph: (ap kapu communuty)

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబు, కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులుగా దాడిశెట్టి రాజా లను నియమిస్తూ బుధవారం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జనసేనా ఓటు బ్యాంక్‌ను వైసీపీ కాజేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైన వైసీపీ పార్టీ కొత్త ప్లాన్‌తో రాజకీయంలో పావులు కదుపుతోంది. ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయినప్పటి నుంచి వరుసగా కాపు నాయకులు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీ, జనసేనా పొత్తుపెట్టుకున్నప్పుడే వైసీపీలో ఉంటే కాపు ఓటర్లు ఒక్కువగా ఉన్నప్రాంతాల్లో గెలవలేవని టీడీపీలో చేరారు.

అందుకే ఇప్పుడు మళ్లీ జనసేనాకు మేజర్ ఓటు బ్యాంక్ అయిన కాపులను వైసీపీ వైపు తిప్పుకోవడానికి పెద్ద ప్లానే వేశారు. ఇందుకోసం కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ పాగా వేయాలని ట్రై చేస్తోంది. 

Also Read:AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు!

కాపు కమ్యూనిటీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్లేస్‌లో ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు పదవులు కట్టబెట్టి ఓటర్లును వైసీపీ వైపు తిప్పుకోవాలని జగన్ పార్టీ చూస్తోంది.  గతంలో కూడా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం వైసీపీలోకి వెళ్తున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేనా వేరువేరుగా పోటీ చేయడం వల్లే వైసీపీకి కలిసొచ్చింది. ఈసారి ఆ ఛాన్స్ లేదు. కూటమిగా ఏర్పడి బీజేపీ, టీడీపీ, తెలుగుదేశం పార్టీలు పోటీ చేయడంతో ఓట్లు ఎక్కువగా చీలిలేదు.

Also Read: ఇదేం ఉద్యోగం తల్లి.. ‘వర్క్ ఫ్రమ్ కార్’.. పోలీసుల పనికి అంతా షాక్!

మళ్లీ కాపు నాయకులను వైసీపీలోకి లాగాలనే ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓటు బ్యాంక్ ఎక్కువ. కూటమి ప్రభుత్వంలో ఎక్కువగా పదవులు దక్కని, అసంతృప్తితో ఉన్న లీడర్లే వైసీపీ టార్గెట్. వారిని పార్టీలోకి చేర్చుకొని జనసేనా ఓటు బ్యాంక్‌ను కాజేశాయని ప్లాన్ లో వైసీపీ ఉంది. వరుసగా వైఎస్ఆర్ సీపీ పార్టీని వీడుతున్న నాయకులను చూసి జగన్ 2.0అనే నినాదంతో జనాల్లోకి రావాలని చూస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు