టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. '' జగన్ త్వరలో రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు జగన్ అంగీకరించారు. అంతా కలిసి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకుందామని జగన్ చెప్పారు. బొత్స సత్యనారాయణను మీడియేటర్‌గా పెట్టి డీకే శివకుమార్‌తో కలిసి ఢిల్లీ పెద్దలతో జగన్ మంతనాలు చేస్తున్నారు.
Also read: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్ .. ఆ రెండు కేంద్రాల్లో రీపోలింగ్
తాడేపల్లిలో మాట్లాడితే బీజేపీ పెద్దలకు తెలుస్తుందని భయపడుతున్నారు. అందుకే బెంగళూరులోని ప్యాలెస్‌లో బోత్సతో జగన్ చర్చలు జరుపుతున్నారు. షర్మిలను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తొలగించాలని ఢిల్లీ పెద్దలకు జగన్ కండిషన్ పెట్టారు. షర్మిలను అధ్యక్షురాలిగా తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని'' రాంగోపాల్ రెడ్డి అన్నారు.
Also Read: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు