/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-6-16.jpg)
Ration shop
Ration Cards : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గతంలో కేవలం బియ్యం మాత్రమే అందించే రేషన్ కార్డుపై ఇక మీదట పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Also Read : Pahalgam attack: వినయ్ నర్వాల్ కుటుంబానికి హర్యానా ప్రభుత్వం భారీగా పరిహారం!
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే లక్ష్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాలే లక్ష్యంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. జూన్ నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ దుఖాణాల్లో సరుకులతో పాటు సబ్సిడీపై కందిపప్పు, ఉచితంగా రాగులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.
ఇక ప్రభుత్వం ప్రజలకు అందించనున్న కందిపప్పు, రాగుల సేకరణకు నడం బిగించింది. రాబోయే మూడు నెలలకు సరిపడా కందిపప్పును, ఏడాదికి సరిపడా రాగులను సేకరించేందుకు ప్రభుత్వం టెండర్లను పిలిచింది. రేషన్‌కార్డుదారులతోపాటు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐసీడీఎస్ లబ్ధిదారులకు కూడా కందిపప్పు, రాగులు అందజేస్తారు.
Also Read : Chhattisgarh : స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
ఇందుకోసం జూన్, జూలై, ఆగస్టు నెలలకు సరిపడేలా రూ.500 కోట్ల విలువైన 47,037 టన్నుల కందిపప్పు, రూ.100 కోట్లకు పైగా విలువైన 25 వేల టన్నుల రాగులు, 43,860 టన్నుల పంచదార సేకరణకు ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఎన్‌ఈఎంఏల్ పోర్టల్ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.46 కోట్లకుపైగా రేషన్‌కార్డుదారులు ఉన్నారు. వీరందరికీ రేషన్ షాపుల ద్వారా అందించే బియ్యానికి బదులుగా రాగులను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్