IMD: ఏపీకి మరోసారి వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు ఈ జిల్లాల్లో వానలు

ఏపీలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందంటున్నారు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో సాయంత్రం వరకు ఎండ.. ఆ తర్వాత వర్షాలు పడుతున్నాయి.

New Update
Rains

AP Rains : ఏపీలో మరోసారి వర్షాలు కురుస్తాయని చెబుతుంది వాతావరణశాఖ. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే  అవకాశాలున్నాయిన అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీలో నేడు పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,  కాకినాడ, డాక్టర్ బీఆర్ బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అల్లూరి సీతారామరాజు,చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు.

Also Read:  ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల.. 5 జిల్లాల్లో 54 మండలాలు

రానున్న 24 గంటల్లో....

ఏపీకి పొరుగున ఉన్న ఒడిశాలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఆ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బాతుపురంలో తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం పడినట్లు అధికారులు వివరించారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. 

Also Read: మీ అంతు చూస్తా.. ఏసీపీ, ఎస్‌పై రెచ్చిపోయిన రఘునందన్‌ రావు

మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటే.. సాయంత్రానికి వాతావరణం మారిపోయి వాన కురుస్తుంది. కార్తీకమాసం దగ్గరపడుతున్నా..రాష్ట్రంలో వేసవిని తలపించేలా ఎండ తీవ్రత కనిపిస్తోంది. కొన్నిచోట్ల తెల్లవారుజామున చలి, మంచు కురుస్తుండగా.. మిగిలిన చోట్ల ఎండ తీవ్రత, ఉక్కపోత వాతావరణం కూడా నమోదు అవుతుంది.

Also Read:  మోహన్‌ బాబు ముఖం మాడిపోయింది...చిరంజీవి ఆ మాట ఎందుకు అన్నారంటే!

కొన్ని ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండడంతో ఎండ తీవ్రత పెరిగింది. ఏపీలోని కావలిలో 37.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే తూర్పుగాలులు ప్రారంభమయ్యేంత వరకూ రాష్ట్రంలో ఉక్కపోత, ఎండ తీవ్రత కొనసాగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: ఏడాదిలో పొలిటికల్ గా కేసీఆర్ ఖతం చేస్తా.. తర్వాత కేటీఆర్.. చిట్ చాట్ లో రేవంత్ సంచలనం

Advertisment
Advertisment
తాజా కథనాలు