AP: ఏపీలో కరవు మండలాల జాబితా విడుదల.. 5 జిల్లాల్లో 54 మండలాలు

ఏపీలో నైరుతి రుతుపవనాల సీజన్ లో ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 54 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

New Update
drought

Ap: ఏపీ ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన కరవు మండలాల జాబితాను తాజాగా ప్రకటించింది. ఐదు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 54 మండలాలు కరవు వల్ల ప్రభావితం అయినట్లు అధికారులు గుర్తించారు. 

Also Read: మోహన్‌ బాబు ముఖం మాడిపోయింది...చిరంజీవి ఆ మాట ఎందుకు అన్నారంటే!

27 చోట్ల తీవ్రంగా.. మరో 27 మండలాల్లో

కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 54 మండలాలు కరవు బారిన పడినట్లు గుర్తించారు.  అలాగే మిగిలిన 21 జిల్లాల్లో కరవు పరిస్థితులు లేనట్లుగా నివేదికలు వచ్చినట్లు తెలిపారు. ఈ మండలాల్లో 27 చోట్ల తీవ్రంగా.. మరో 27 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో తెలిపింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ మేరకు కరువు మండలాలను గుర్తించారు .రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో అధిక వర్షపాతం నమోదైనా.. సగటు వర్షపాతాన్ని పరిగణలోకి తీసుకుని ఈ విచారణ చేపట్టారు. 

Also Read:  మీ అంతు చూస్తా.. ఏసీపీ, ఎస్‌పై రెచ్చిపోయిన రఘునందన్‌ రావు

ఈ మేరకు సాధారణం కన్నా అతి తక్కువ వానలు పడ్డ మండలాలను కరువు మండలాలుగా గుర్తించి ప్రకటించారు. అనంతపురం జిల్లాలో 56.4 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 52.7 శాతం, అన్నమయ్య జిల్లాలో 46.6 శాతం, చిత్తూరు జిల్లాలో 45.4 శాతం, కర్నూలు జిల్లాలో 18.2 శాతం చొప్పున సాధారణం కంటే తక్కువ వర్షం నమోదయ్యాయని ప్రస్తావించారు. 2023 ఖరీఫ్‌లో 88.55 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా.. అదే 2024 ఖరీఫ్‌లో 93.55 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేపట్టారు. 

Also Read:  కాణిపాకంలో అపచారం..ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు

ఏపీలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 114.72 లక్షల ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా.. 82 శాతం విస్తీర్ణంలో రైతులు సాగు చేశారు.చిత్తూరు జిల్లా పెనుమూరు, గుడిపాల, యాదమర్రిని తీవ్ర కరువు మండలాలుగా ప్రకటించారు. చిత్తూరు జిల్లా చిత్తూరు, శ్రీరంగరాజపురం, రొంపిచర్ల, బైరెడ్డిపల్లె, వెంకటగిరికోట, గుడుపల్లె, పూతలపట్టు, కుప్పం, రామకుప్పం సోమల, పుంగనూరు, పలమనేరు, శాంతిపురం,  మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. అనంతపురం జిల్లా నార్పల, అనంతపురం తీవ్ర కరువు మండలాలు. అనంతపురం జిల్లా గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు  విడపనకల్‌, యాడికి, కరువు మండలాలుగా ప్రకటించారు. 

Also Read:  ఏపీలో మందుబాబులకు పండగే పండగ.. ధరలు తగ్గింపు

శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ, తలుపుల తీవ్ర కరువు మండలాలుగా.. కనగానపల్లి, ధర్మవరం, నంబులపులకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగిని  తాడిమర్రి, కరువు మండలాలుగా ప్రకటించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె, రాయచోటి, పీలేరు, గాలివీడు, చిన్నమండెం, బి.కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపల్లె, సంబేపల్లి, టి.సుండుపల్లె, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, వీరబల్లె, గుర్రంకొండ, కలకడ, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, కర్నూలు జిల్లా కౌతాళం, పెద్ద కడుబూరు కరువు మండలాలుగా ప్రకటించారు.

Also Read:  ఏపీ మంత్రి సుభాష్‌ కు తప్పిన పెను ప్రమాదం!

Advertisment
Advertisment
తాజా కథనాలు