Chiru: మోహన్‌ బాబు ముఖం మాడిపోయింది...చిరంజీవి ఆ మాట ఎందుకు అన్నారంటే!

ప్రతిష్టాత్మక స్వర్గీయ ఏఎన్నాఆర్ జాతీయ అవార్డును చిరంజీవికి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తర్వాత చిరు మరోసారి పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాలు ఆర్టికల్‌ లో

New Update

Chiru VS Mohan Babu: అది 2007 తెలుగు సినిమా వ‌జ్రోత్సవ వేడుకలు.. స్టేజీపై ఎక్కిన పవర్ స్టార్‌ పవన్ కల్యాణ్‌ ఆవేశంగా  'తమ్ముడు మోహన్ బాబు..' అని ఓ డైలాగ్‌  పేల్చారు. ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. మోహన్‌ బాబు మాత్రం పవన్‌ స్పీచ్‌ ఇస్తున్నంత సేపు నవ్వుతూ ఉన్నారు. ఇది మోహన్‌బాబుపై పవన్‌ వేసిన సెటైరే. అయితే అంతకముందు పెద్ద రచ్చే జరిగింది. చిరంజీవికి లెజండరీ అవార్డు ఇవ్వడాన్ని మోహన్‌బాబు బహిరంగంగా వ్యతిరేకించారు.

మరో 25 ఏళ్ల తర్వాత..

తనకు ఇవ్వకుండా చిరంజీవికి ఎందుకు ఇస్తున్నారో అని అర్థం వచ్చేలా మాట్లాడారు. మోహన్‌బాబు మాటలకు హర్ట్ అయిన చిరంజీవి ఆనాడు ఎంతో ఎమోషనల్‌ అయ్యారు. మరో 25 ఏళ్ల తర్వాత ఈ అవార్డు తనకు ఇవ్వాలని పెద్దలు భావిస్తే ఇవ్వండని.. అప్పటివరకు ఇవ్వద్దని అవార్డును తిరస్కరించాడు. సీన్‌ కట్‌ చేస్తే 2024.. ANR నేషనల్‌ అవార్డు వేడుకలు.. మరోసారి ఇదే అంశం తెరపైకి వచ్చింది.

Also Read: విజయమ్మకు వైసీపీ కౌంటర్!

ప్రతిష్టాత్మక స్వర్గీయ ఏఎన్నాఆర్ జాతీయ అవార్డును చిరంజీవికి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తర్వాత చిరు మరోసారి పాత విషయాలను గుర్తు చేసుకున్నారు. ఇప్పటివరకూ తనకి ఎన్ని అవార్డులు వచ్చినా సరే ఏఎన్ఆర్ అవార్డు రావడం తనకి చాలా ప్రత్యేకమని చిరంజీవి చెప్పారు. సాధారణంగా అందరూ ఇంట గెలిచి రచ్చ గెలుస్తారని.. కానీ నేను మాత్రం రచ్చ గెలిచి.. ఇప్పుడే ఇంట గెలిచానంటూ కామెంట్స్ చేశారు.

Also Read: నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు!

"నా సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలు చేశాను. కానీ ఎన్ని సినిమాలు చేసినా, ఎంత క్రేజ్ సంపాదించినా ఇంట్లో మా నాన్న నన్ను ఎప్పుడూ కూడా అభినందించలేదు. ఈ విషయంపై చాలా బాధపడేవాడ్ని. ఈ విషయం గురించి అమ్మ దగ్గర మాట్లాడితే... లేదురా పిల్లలను తల్లిదండ్రులు పొగడటం మంచిది కాదు అని మీ నాన్న నిన్ను పొగడరు.. కానీ నీ గురించే ఎప్పుడూ మాట్లాడుతుంటారు అంటూ మా అమ్మ చెప్పింది. అప్పుడు నాకు  ఓహో నేను ఇంట.. రచ్చ కూడా గెలిచానని కూడా అనిపించింది.." అని చెప్పుకొచ్చారు మెగాస్టార్. 

Also Read: CHD అంటే ఏంటి?.. పెద్దవారికి ఇది ప్రమాదమా?

అయితే ఇండస్ట్రీ విషయానికొస్తే నేను ఎప్పుడో రచ్చ గెలిచాను.. కానీ ఇంట మాత్రం ఇప్పటివరకూ గెలవలేకపోయానన్నారు. అలా గెలిచే అవకాశం ఒకసారి వచ్చిందని.. తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకలను ప్రస్థావించారు. నాకు అందరూ కలిసి లెజెండరీ అవార్డు ఇచ్చారు. కానీ అది నాకు ఇవ్వడం కొంతమందికి నచ్చలేదు అంటూ చిరు అప్పటి సంగతులను మరోసారి గుర్తు చేసుకున్నారు. దీంతో అసలు ఆనాడు ఏం జరిగింది అనే దాని మీద అంతా చర్చించుకుంటున్నారు.

Also Read:  ఏపీలో మందుబాబులకు పండగే పండగ.. ధరలు తగ్గింపు

వజ్రోత్సవాల వేడుకలో చిరంజీవి లెజండరీ అవార్డు అందుకున్న తరువాత మోహన్‌బాబు వేదిక మీద ప్రసంగించారు. మోహన్‌ బాబు మాట్లాడుతూ  ఈ వజ్రోత్సవాల వేడుకలో మిమ్మల్ని సన్మానిస్తున్నాం అన్నారు. నేను వద్దన్నాను. అయితే వాళ్లు మీరు లెజెండ్‌ కాదు.. మిమ్మల్ని సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నాం అన్నారు. అసలు లెజెండ్‌ అంటే ఏమిటి? సెలబ్రిటీ అంటే ఏమిటి? ముందు మీరు దాని మీద ఓ పుస్తకం తీసుకురండి. సెలబ్రిటీని ఇలా గౌరవించాలి. లెజెండ్‌కు ఇలాంటి క్వాలిటీస్‌ ఉండాలని చెప్పండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్‌బాబు.

ఆ తరువాత స్టేజీ మీదకి వచ్చిన చిరంజీవి ప్రసంగిస్తూ '' నాకు లెజెండరీ సన్మానం చేస్తా అన్నప్పుడు నేను వద్దన్నాను. వెంకటేష్‌, నాగార్జున, బాలకృష్ణలతో సమానమైనవాడిని. నన్ను లెజెండ్‌ని చేసి వాళ్ల నుంచి దూరం చేయకండి అని చెప్పాను. కానీ అవార్డు నిర్వాహకులు నన్ను కన్వీన్స్‌ చేశారు. అయితే ఈ అవార్డును నేను యాక్సెప్ట్‌ చేయడం లేదు. నేను అవార్డును సరెండర్‌ చేస్తున్నానని'' చెప్పారు చిరు. నాడు ఆ అవార్డును, శాలువాను, టైమ్‌ క్యాప్యూల్స్‌ బాక్స్‌లో ఉంచారు చిరు. తెలుగు సినిమా 100 సంవత్సరాల వేడుకలో అంటే 25 సంవత్సరాల తరువాత తాను అర్హుడిని అని అందరికీ అనిపిస్తే తన తోటి హీరోలందరూ కూడా అది కరెక్ట్‌ అనిపిస్తే వాళ్ల సమక్షంలోనే ఈ అవార్డును తీసుకుంటానని చిరు చెప్పిన మాటలను అంతా గుర్తు చేసుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు