Telangana: మీ అంతు చూస్తా.. ఏసీపీ, ఎస్‌పై రెచ్చిపోయిన రఘునందన్‌ రావు

తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తే.. ఊరుకునేది లేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు పోలీసులను హెచ్చరించారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని తమ పార్టీ కార్యకర్తలు చేశారన్నారు.

New Update

BJP MP Raghu Nandana Rao: సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రార్థనా మందిరం నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. నిర్మాణాన్ని అడ్డుకొని గోడ కూల్చారంటూ ఓ వర్గంపై మరో వర్గం కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఓ వర్గానికి చెందిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read:  ఏడాదిలో పొలిటికల్ గా కేసీఆర్ ఖతం చేస్తా.. తర్వాత కేటీఆర్.. చిట్ చాట్ లో రేవంత్ సంచలనం

ఈ కేసులో అరెస్టైన వారికి బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు మద్దతుగా నిలిచారు. తమ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తే.. ఊరుకునేది లేదని పోలీసులకు ఆయన సూచించారు.

Also Read: ఏపీలో మందుబాబులకు పండగే పండగ.. ధరలు తగ్గింపు

ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణం జరుగుతుంటే తమ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని పోలీసులకు ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని తమ పార్టీ కార్యకర్తలు చేశారన్నారు. 

Also Read:  అమల్లోకి గస్తీ ఒప్పందం..బలగాల ఉపసంహరణ

అరెస్ట్ చేస్తే సహించేది లేదని

చట్ట ప్రకారం కాకుండా ఇష్టానుసారం అరెస్ట్ చేస్తే సహించేది లేదని పోలీసులకు ఈ సందర్భంగా రఘునందన్‌రావు హెచ్చరించారు. కాగా ప్రార్థన మందిరాన్ని అడ్డుకున్నారనే ఆరోపణలతో 8 మందిని అరెస్ట్‌చేసి రిమాండ్‌ చేసినట్లు ఎంపీ ఆరోపించారు. తిమ్మారెడ్డిపల్లిలో అసైన్డ్‌ భూమిలో అనుమతి లేకున్నా ప్రార్థన మందిరాన్ని నిర్మించిన దాన్ని అడ్డుకుంటే కేసులు పెట్టడం సరికాదని రఘునందన్‌ రావు పోలీసులపై ఫైర్‌ అయ్యారు. 

Also Read:  మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ

ప్రభుత్వ భూమిలో ప్రార్థన మందిరాన్ని కడితే అడ్డుకోవలసింది పోయి అడ్డుకున్న వారిని అరెస్ట్‌ చేయడాన్ని ఆయన నిలదీశారు. ఈ విషయమై కుకునూరు పల్లి స్టేషన్‌కు వెళ్లిన ఆయన ఎసీపీ, ఎస్‌ఐలను నిలదీశారు. కాగా ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:  ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. 'RT75' నుంచి మాస్ అప్డేట్

Advertisment
తాజా కథనాలు