కెనడాలో ఇటీవల ముగ్గురు భారతీయ విద్యార్థులు హత్యకు గురైన ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి స్పందించింది. ఈ ఘటనలపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విదేశాంగశాఖ చర్యలు తీసుకుంటోందని పేర్కొంది. ఒట్టావాలోని భారత హైకమిషన్‌తో పాటు టోరంటో, వాంకోవర్‌లో కాన్సులేట్‌లను అప్రమత్తం చేసినట్లు తెలిపింది.
ఇది కూడా చూడండి: పుష్ప–2 విక్టరీ నాది కాదు మొత్తం ఇండియాది– అల్లు అర్జున్
అలాగే భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కెనడా అధికార యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నామని చెప్పింది. విదేశాల్లో ఉన్న భారత పౌరుల రక్షణే కేంద్రానికి తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ప్రస్తుతం కెనడాలో ఉన్న భారతీయులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొంది. అధికారిక గణాంకాల ప్రకారం కెనడాలో దాదాపు 4 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుతున్నారు.
#WATCH | Delhi: On Indian Students in Canada, MEA Spokesperson Randhir Jaiswal says, "In the last week, we have had unfortunate tragedies in Canada. Three Indian students have been murdered in violent crimes. We are saddened by these terrible tragedies that have struck our… pic.twitter.com/G7dNPkEuJV
— ANI (@ANI) December 13, 2024
ఇది కూడా చూడండి: ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో అమెరికా, కెనడాలో భారతీయ విద్యార్థులు మృతుల ఘటనలు చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే హత్యలు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీంతో ఉన్నత చదువుకోసం విదేశాల్లోకి వెళ్లి అక్కడ చదువుకునే పరిస్థితులు కూడా ఆందోళనకరంగా మారింది.
Also Read: భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే?
Also Read: అలా అయితే సగం మంది రాజకీయ నాయకులు జైలుకే! బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు