/rtv/media/media_files/2025/09/09/hindu-vs-christian-war-2025-09-09-12-57-24.jpg)
Hindu vs Christian war
AP News: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసింది. గ్రామ దేవత పోలేరమ్మ ఆలయం పక్కన ఉన్న స్థలం విషయంలో వివాదం తలెత్తింది. రాళ్లు, కర్రలతో రెండు వర్గాలు పరస్పరం కొట్టుకోవడంతో పలువురికీ తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఇది కూడా చూడండి:Dhoni The Chase Teaser: M.S ధోని ఊరమాస్ టీజర్.. యాక్టింగ్ గూస్‌బంప్స్
సీసలి హరిజన పేటకు చెందిన కాలువ ఒడ్డున తాటిచెట్టు ఉండగా, అక్కడ కొన్ని సంవత్సరాలుగా పోలేరమ్మకు పూజలు చేస్తున్నారు. జూన్‌లో అదే ప్రాంతంలో పోలేరమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. గుడికి పక్కనే కొంత స్థలం ఉంది. ఈ స్థలాన్ని స్థానిక దళితులు అంబేడ్కర్ జయంతి రోజున భోజనాలు వండేందుకు వాడుకుంటున్నారు. ఈ స్థలంలోనే పోలేరమ్మ ఉత్సవాలు జరిగినప్పుడు భోజనాలు పెట్టుకునేందుకు షెడ్డు కట్టాలని కొంతమంది నిర్ణయించారు. ఆ ఆలోచనను స్థానిక దళితులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ అంబేడ్కర్ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఏర్పాటుతో ఇరువర్గాల మధ్య తలెత్తిన వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.అదుపుచేసేందుకు వెళ్లిన పోలీసులపై కూడా రాళ్ల దాడి చేయడంతో పలువురికి గాయలయ్యాయి.తలలు పగటడంతో-- మరికొంతమందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో మరోసారి ఉద్రిక్తత
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హిందువులు- క్రైస్తవుల మధ్య వివాదం ముదురుతుంది. నందిగామలోని కంచికచర్లలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో హిందువులపై దాడికి నిరసనగా బంద్ కార్యక్రమం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఈనెల 6న వినాయకుడి విగ్రహం నిమజ్జనోత్సవం సందర్భంగా స్థానిక ఎస్సీ కాలనీ చర్చి వద్ద హిందువులపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీనికి నిరసనగా నిరసన చేపట్టారు. కంచికచర్ల మండలం పరిటాల గ్రామం వద్ద నుంచి కంచికచర్ల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య పరిటాల కంచికచర్ల గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇది కూడా చూడండి:Dhoni The Chase Teaser: M.S ధోని ఊరమాస్ టీజర్.. యాక్టింగ్ గూస్‌బంప్స్
కంచికచర్లలో అమల్లోకి పోలీస్ యాక్ట్- 30 అముల చేస్తున్నారు.ఎలాంటి నిరసనలకు పర్మిషన్ లేదని పోలీసులు తేల్చి చెప్పారు.నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కాగా తమను ఎవరూ పట్టించుకోవట్లేదని హిందువులక ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు. హిందువులను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తు్న్నారు.తమ మీద దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హిందూసంఘాలు హెచ్చరించాయి.
ఇది కూడా చూడండి:YS Raja Reddy : మామకు పోటీగా అల్లుడు.. రాజారెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఇదే!